నవంబర్ 22 నుంచి : ట్విట్టర్‌లో రాజకీయ ప్రకటనలన్నింటిపై నిషేధం

  • Published By: sreehari ,Published On : October 31, 2019 / 10:19 AM IST
నవంబర్ 22 నుంచి : ట్విట్టర్‌లో రాజకీయ ప్రకటనలన్నింటిపై నిషేధం

సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆన్ లైన్ లో తప్పుడు సమాచారం భారీగా స్ప్రెడ్ అవుతుంది. ఫేక్ న్యూస్ ను కంట్రోల్ చేసేందుకు ఇదివరకే సోషల్ మీడియా కంపెనీలు రంగంలోకి దిగాయి. తమ ప్లాట్ ఫాంపై తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముందుగానే ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు ఫేక్ న్యూస్ కట్టడి చేసే పనిలో పడ్డాయి. 

వచ్చే నెల నుంచి ట్విట్టర్ ప్లాట్ ఫాం అన్ని రాజకీయ ప్రకటనలను నిషేధించనున్నట్టు కంపెనీ సీఈఓ జాక్ డోర్సీ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ప్రచారానికి ముందుగానే తమ ప్లాట్ ఫాంపై తప్పుడు సమాచారం వ్యాప్తిని నియంత్రించాలనే ఒత్తిడి ఎదుర్కొంటున్న సోషల్ మీడియా కంపెనీలు ఈ దిశగా చర్యలు చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ తమ ప్లాట్ ఫాంపై రాజకీయ ప్రకటనలన్నింటిని నిలిపివేయాలని నిర్ణయించినట్టు సీఈఓ జాక్ తెలిపారు. 

నవంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిషేధం ట్విట్టర్ వ్యాపారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని విశ్లేషకులు ఆశించి ఉండరు. ఈ నిర్ణయంతో ట్రేడింగ్ అయిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ షేర్లు 1.9శాతానికి పడిపోయాయి. ఎన్నికల సమయంలో ఆన్ లైన్ ప్లాట్ ఫాంపై తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా పొలిటికల్ యాడ్స్ నిలిపివేయాలని సోషల్ మీడియా కంపెనీలు ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలపై రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.

రిపబ్లికన్ పార్టీ ట్రంప్ గెలిచిన 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని వేదికపై రష్యా ప్రచారం చేసిన తరువాత తప్పుడు సమాచారాన్ని పరిష్కరించే ప్రయత్నాలను ఫేస్ బుక్ చేపట్టింది. ట్విట్టర్ లో పొలిటికల్ యాడ్స్ నిషేధంపై డోర్సే నవంబర్ 15న పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలను షేర్ చేయనున్నారు. నవంబర్ 22 నుంచి పొలిటికల్ యాడ్స్ ను అంగీకరించడం నిలిపివేయడం జరుగుతుందని డోర్సే స్పష్టం చేశారు.