Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు మిగిలిన ఆఖరి పోరాటం అదే

శివసేనకు ఇది చాలా కఠినమైన సమయం. బాల్ థాకరే మరణం శివసేనకు ఎలాంటిదో, ఇప్పటి పరిస్థితి కూడా అలాంటిదే. దీనిపై మేము అటు కోర్టుతో పాటు ఇటు రోడ్లపై కూడా పోరాటం చేస్తాం. అలాగే ఈసారి చాలా స్ట్రాటజీతో పని చేస్తాం. సుపారి తీసుకుని వాళ్లు (షిండే వర్గం) శివసేను అంతం చేయాలని చూస్తున్నారు. కానీ మహారాష్ట్ర ఉన్నంత కాలం అది జరగదు

Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు మిగిలిన ఆఖరి పోరాటం అదే

Uddhav Thackeray have last fight for for keep shiv sainiks

Shiv Sena: శివసేన పార్టీని దక్కించుకోవడానికి ఉద్ధవ్ థాకరేకు అన్ని పోరాటాలు అయిపోయాయి. ఇక ఆయనకు ఒకే ఒక్క పోరాటం మిగింది. శివసైనికులు గెట్టు దాటకుండా ప్రత్యర్థులతో థాకరే పోరాడాల్సి ఉంది. పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సింహభాగం ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేతో వెళ్లినప్పటికీ కార్యకర్తల్లో ఎక్కువ మాత్రం ఉద్ధవ్ వర్గంతోనే ఉన్నారు. షిండే వైపుకు ఎక్కువ లీడర్ వర్గం ఉంటే, థాకరే వైపుకు ఎక్కువ క్యాడర్ వర్గం ఉంది. వాస్తవానికి లీడర్ కంటే కొన్ని సందర్భాల్లో క్యాడర్ చాలా అవసరం. ఈ క్యాడర్ కనుక ఉద్ధవ్ నిలబెట్టుకుంటే పాత శివసేను మళ్లీ పునరుద్ధరించొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Bihar: నితీశ్ కుమార్‭కు షాకిచ్చిన కూష్వాహా.. జేడీయూ నుంచి ఔట్, వెంటనే కొత్త పార్టీ ప్రకటన

ఎనిమిది నెలల ఉత్కంఠ అనంతరం అసలు శివసేన షిండేదేనని కేంద్ర ఎన్నికల సంఘం మొన్నటి శుక్రవారం తేల్చి చెప్పంది. షిండే వర్గానికే పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కేటాయించింది. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా కేటాయించిన పార్టీ, ఎన్నికల గుర్తును థాకరే వర్గం కొనసాగించుకోవచ్చని స్పష్టం చేయింది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ ఆదేశాలపై ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ అయితే చేజారినట్టే కానీ, శివసైనికుల్ని మాత్రం కోల్పోకుండా ఇప్పుడు థాకరే జాగ్రత్త పడాలంటూ సూచనలు వస్తున్నాయి.

CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్

పార్టీ వదులుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సైతం ఒక సూచన చేశారు. ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, మళ్లీ దానిపై చర్చ అనవసరమని, ఇప్పటి వచ్చిన నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే అంటూ సూచించారు. అయితే కొత్త ఎన్నికల గుర్తు వచ్చినంత మాత్రం ప్రజల ఆదరణ పోదని, ఈ చర్చ కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మారడం, ఎడ్లబండి నుంచి హస్తం గుర్తు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పుంజుకున్న విషయాన్ని పవార్ ఉదహరించారు.

MLA Raja Singh: పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రాజాసింగ్

ఇక షిండేపై ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాల్ థాకరేకు షిండే మోసం చేశారని, ఆయన స్థాపించిన పార్టీని చీల్చడమే కాకుండా, ఇప్పుడు దుర్మార్గంగా సొంతం చేసుకున్నారని అన్నారు. ‘‘శివసేనకు ఇది చాలా కఠినమైన సమయం. బాల్ థాకరే మరణం శివసేనకు ఎలాంటిదో, ఇప్పటి పరిస్థితి కూడా అలాంటిదే. దీనిపై మేము అటు కోర్టుతో పాటు ఇటు రోడ్లపై కూడా పోరాటం చేస్తాం. అలాగే ఈసారి చాలా స్ట్రాటజీతో పని చేస్తాం. సుపారి తీసుకుని వాళ్లు (షిండే వర్గం) శివసేను అంతం చేయాలని చూస్తున్నారు. కానీ మహారాష్ట్ర ఉన్నంత కాలం అది జరగదు’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు.