Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు

1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం

Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు

Uddhav Thackeray scales up attack on ECI

Uddhav Thackeray: శివసేన పార్టీ ఎన్నికల గుర్తు (విల్లు-బాణం) కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. అసలైన శివసేన తనకే రావాలంటూ ఆయన చేసిన విజ్ణప్తిని ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో పాటు దాన్ని ప్రత్యర్థి, మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికి కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల సంఘం బానిసలా మారిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొందరలో ముంబై మున్సిపాలిటీ (బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇక అక్కడే తేల్చుకుంటామని ఉద్ధవ్ సవాల్ విసిరారు.

Lokesh Padayatra : తార‌క‌ర‌త్న మృతితో నారా లోకేష్ యువగళం పాద‌యాత్ర‌కి బ్రేక్…

శనివారం తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ఉద్ధవ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట్లు గతంలో ఎప్పుడూ జరగేలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్ థాకరే లాగే కారు రూఫ్ మీద నిలబడి ఉద్ధవ్ ప్రసంగించారు. ‘‘దొంగలు పార్టీని దొంగిలించారు. పార్టీ గుర్తును దొంగిలించారు. వారికి గుణపాఠం చెప్పాలి’’ అని బీఎంసీ ఎన్నికలను ఉద్దేశించి అన్నారు.

Israeli Missile Strikes Damascus: సిరియా రాజధానిపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. 15మంది మృతి

1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది.