Uddhav Thackeray: ”బీజేపీ ఇంతకంటే ఎక్కువే అనుభవిస్తుంది”

అధికారం మత్తులో కూరుకుపోయిన భారతీయ జనతా పార్టీ క్రూరంగా వ్యవహరిస్తోందని, అయితే సమయం అందరికీ సమాధానం ఇస్తుందని, ఇప్పుడు చేస్తున్నదానికి భవిష్యత్‭లో బీజేపీ ఎక్కువగానే అనుభవిస్తుందని శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు.

Uddhav Thackeray: ”బీజేపీ ఇంతకంటే ఎక్కువే అనుభవిస్తుంది”

Uddav Thakeray

Uddhav Thackeray: అధికారం మత్తులో కూరుకుపోయిన భారతీయ జనతా పార్టీ క్రూరంగా వ్యవహరిస్తోందని, అయితే సమయం అందరికీ సమాధానం ఇస్తుందని, ఇప్పుడు చేస్తున్నదానికి భవిష్యత్‭లో బీజేపీ ఎక్కువగానే అనుభవిస్తుందని శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. తాజాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‭ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సోమవారం రౌత్ ఇంటికి వచ్చిన ఉద్ధవ్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అధికార మత్తులో కూరుకుపోయిన వారికి నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. మరింత క్రూరంగా వెళ్లకండి. ఎందుకంటే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. సమయం అందరికీ సమాధానం చెప్తుంది. మీరు ఏం ఇస్తున్నారో భవిష్యత్‭లో ఇతరుల నుంచి మీకదే వస్తుంది. ఇప్పుడు మీరు(బీజేపీ) చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. గుర్తు పెట్టుకోండి. భవిష్యత్‭లో ఇంతకంటే ఎక్కువే అనుభవిస్తారు. కానీ దేశంలో అంతటి క్రూర పరిస్థితులు రావొద్దనే అనుకుంటున్నాను’’ అని అన్నారు.

బీజేపీ అధినేత నడ్డా వ్యాఖ్యలను ఉద్ధవ్ ప్రస్తావిస్తూ ‘‘స్థానిక పార్టీలని పూర్తిగా నిర్మూలించాలని వారు అనుకుంటున్నారు. మహారాష్ట్రలో శివసేనను నిర్మూలించాలని అవే కలలు కంటున్నారు. దమ్ముంటే బీజేపీని ఆ పని చేయమనండి. బీజేపీ అంటే హిందువులను వేరు చేయడం.. భాషా, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ అల్లర్లు రెచ్చగొట్టడం. మహారాష్ట్రలో కూడా మరాఠీ-మరాఠీయేతరుల మధ్య ఇలాంటి వైరుధ్యాలే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ప్రతిపక్షం లేకుండా చేసేందుకు బీజేపీ చేస్తున్న దుష్టచర్య. ఎన్సీపీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ అన్నాచెల్లెల్ల పార్టీ అంటూ బీజేపీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని నడ్డా అన్నారు. కానీ బీజేపీ తన ప్రస్థానాన్ని ఎక్కడ ప్రారంభించిందో గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్