ఎన్నికల ప్రచారంలో అపశృతి : లోకేష్ కు తప్పిన ప్రమాదం

ఎన్నికల ప్రచారంలో అపశృతి : లోకేష్ కు తప్పిన ప్రమాదం

ఎన్నికల ప్రచారంలో అపశృతి : లోకేష్ కు తప్పిన ప్రమాదం

గుంటూరు : లోకేష్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. నిడమర్రులో ప్రచారానికి వెళ్లిన లోకేష్ పై హోటల్ బోర్డు ఊడి పడింది. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా బోర్డు కిందపడింది. కార్యకర్తల అప్రమత్తతో లోకేష్ కు ప్రమాదం తప్పింది.

గుంటూరు జిల్లా మంగలగిరి నియోజవర్గం మంగలగిరి రూరల్ మండలంలోని నిడమర్రులో లోకేష్ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రచారంలో ఆయన నిమగ్నమయ్యారు. హోటల్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఇనుప బోర్డు ఒక్కసారిగా లోకేష్ సమీపంలో ఊడి పడింది. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండటంతో లోకేష్ కు ప్రమాదం తప్పింది. నలుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లోకేష్ కు ఎలాంటి అపాయం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

×