Prayagraj: అతీక్ అహ్మద్‭ హత్యను విపక్షాల ఖాతాలో వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి

పోలీసుల సంకెళ్ల మధ్యలో ఉన్న అతీక్ అహ్మద్ సహా సోదరుడు అష్రఫ్‌‭ను ఏప్రిల్ 15న లైవ్ మీడియా సమక్షంలోనే దారుణ హత్య చేశారు. ఇక అతీక్ అహ్మద్ హత్య కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది

Prayagraj: అతీక్ అహ్మద్‭ హత్యను విపక్షాల ఖాతాలో వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి

UP minister Dharampal Singh

Prayagraj: మాజీ ఎంపీ, గ్యాంగ్‭స్టర్ అతీక్ అహ్మద్ సహా అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‭ను వారం రోజుల క్రితం పోలీసుల కస్టడీలోనే మీడియా ముందు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యను విపక్షాల ఖాతాలో వేశారు ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ధరంపాల్ సింగ్. తమ రహస్యాలను బయటపెడతారనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు గ్యాంగస్టర్ అతీక్ అహ్మద్‭ని హత్య చేయించాయని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చందౌసి నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Javed Akhtar: నాస్తికులకు కూడా పండగలు ఉండాలట.. సలహాలు ఇవ్వమంటున్న జావెద్ అఖ్తర్

ఇక ఈ హత్యపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొత్త ప్రశ్నల్ని లేవనెత్తారు. అతీఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు హంతకులకు ఆటోమాటిక్ ఆయుధాలు ఎలా వచ్చాయని, లక్షల ఖరీదైన పిస్టళ్లను వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఓవైసీ ఈ ప్రశ్నలు లేవనెత్తారు. హంతకులు మరింతమందిని చంపే అవకాశం ఉందని, అలాంటి ఉగ్ర మనస్తత్వం ఉన్న వాళ్లపై దేశద్రోహ చట్టం కానీ, జాతీయ భద్రతా చట్టం కానీ ఎందుకు పెట్టలేదని ఓవైసీ ప్రశ్నించారు. సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు.

Rahul Gandhi: అధికారిక నివాసం తాళాలు అప్పగించి, ప్రజలకు థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ

పోలీసుల సంకెళ్ల మధ్యలో ఉన్న అతీక్ అహ్మద్ సహా సోదరుడు అష్రఫ్‌‭ను ఏప్రిల్ 15న లైవ్ మీడియా సమక్షంలోనే దారుణ హత్య చేశారు. ఇక అతీక్ అహ్మద్ హత్య కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది. అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ సహా పోలీసులు, మీడియా వేషధారణలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‭రాజ్‭లో హత్య జరిగిన ప్రాంతంలోనే జరిగిన తంతును మరోసారి పునర్ణిర్మానం చేసే ప్రయత్నం చేశారు. ఇటు అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను కాల్చి చంపిన లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య ప్రాణాలకు ముప్పుందని, వారిపై దాడి జరిగే అవకాశముందని పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందిందని తెలిసింది. దీంతో వారి భద్రతను కట్టుదిట్టం చేశారు.