ఇసుక దీక్ష : పనికి రాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా – బాబు

  • Edited By: madhu , November 14, 2019 / 08:50 AM IST
ఇసుక దీక్ష : పనికి రాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా – బాబు

రాష్ట్రంలో 11 మంది ముఖ్యమంత్రులను చూశా..ఇలాంటి పనికిరాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా…అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని..టెర్రరిస్టుల మాదిరిగా భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు బాబు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ దగ్గర 12 గంటల నిరసన దీక్షకు దిగారు బాబు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..తొలి రోజు నుంచే కూల్చివేతలు మొదలు పెట్టి అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. ఇసుక కొరతతో కార్మికులు మరణిస్తే .. కాలం చెల్లి చనిపోయారని మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. వారి కుటుంబంలోని వారు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలానే మాట్లాడుతారా అని నిలదీశారు.

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఇసుకకొరతపై నిరసన దీక్షకు భవన నిర్మాణ కార్మికులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. వినూత్నంగా కళ్లజోడ్లు, డేంజర్‌ మాస్క్‌లు పెట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, జగన్‌ అధికారంలోకి వచ్చాక తమ జీవితాలు రోడ్డున పడ్డాయని.. భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు..

బాబు చేపట్టిన దీక్ష ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఏపీలో ఇసుక కొరతను తీర్చడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు రూ.25లక్షలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో ఆయన దీక్ష చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 
Read More : జగన్ రెడ్డి అంటే తప్పేముంది..తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదు