జూ.ఎన్టీఆర్ అండతో విజయవాడ సీటు దక్కించుకున్న వంశీ

వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : October 27, 2019 / 11:27 AM IST
జూ.ఎన్టీఆర్ అండతో విజయవాడ సీటు దక్కించుకున్న వంశీ

వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం

వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జిల్లా టీడీపీలో ఫైర్‌బ్రాండ్ నేతగా వంశీ గుర్తింపు పొందారు. 

వంశీ పార్టీ మారతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వెళ్తారని కొందరు.. బీజేపీలోకి వెళ్తారని ఇంకొందరు ..ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను కలవడం, అంతకుముందు బీజేపీ సుజనా చౌదరిని కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వైసీపీలో వంశీ చేరకుండా గన్నవరం స్థానిక నేత యార్లగడ్డ వెంకట్రావు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వంశీ వస్తే వైసీపీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇంతలోనే వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు.

పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ చీఫ్ చంద్రబాబుకి రాజీనామా లేఖను పంపారు వంశీ. వైసీపీ నేతలు, కొందరు అధికారుల తీరు వల్ల కేడర్‌ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర రాజకీయాలతో తాను, తన అనుచరులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. వాటిని ఎదుర్కొనేందుకు తన దగ్గర బలమైన మార్గం ఉన్నా.. దానికి తన మనసు అంగీకరించడం లేదన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు తనకు మంచి అవకాశాలు కల్పించారని.. ఆయనకు ధన్యవాదాలని లేఖలో తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ తో వంశీకి మంచి రిలేషన్ ఉంది. అదుర్స్ చిత్రానికి వంశీ నిర్మాతగా వ్యవహరించారు. 2006లో టీడీపీలో చేరారు. 2009లో విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. జూ.ఎన్టీఆర్ అండతోనే 2009లో విజయవాడ సీటు దక్కించుకున్నారు వంశీ. 2014లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానికి వల్లభనేని వంశీ మిత్రుడు. మొత్తంగా వంశీ తీసుకున్న నిర్ణయం టీడీపీ శ్రేణుల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.