ఊహించని ట్విస్ట్ : వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు

  • Published By: veegamteam ,Published On : October 27, 2019 / 10:39 AM IST
ఊహించని ట్విస్ట్ : వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు ఎవరూ ఊహించని ట్విస్ట్  ఇచ్చారు. ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. 

తన రాజీనామా లేఖను చంద్రబాబుకి పంపారు వంశీ. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించారు. గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్, ప్రభుత్వ అధికారులపై వంశీ తీవ్ర ఆరోపణలు  చేశారు. కుట్ర రాజకీయాలు, అధికారుల పక్షపాతి వైఖరి వల్ల నేను, నా అనుచరులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామని వాపోయారు. తన వల్లే తన అనుచరులకు ఇబ్బందులు పెరిగినట్టు భావిస్తున్నా అన్నారు.  వీటిని తప్పించుకోవడానికి బలమైన అవకాశం ఉన్నా తన మనసు అంగీకరించడం లేదన్నారు. అందుకే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని వంశీ వెల్లడించారు. ఇంతకాలం అవకాశం  కల్పించినందుకు చంద్రబాబుకి వంశీ కృతజ్ఞతలు తెలిపారు. వంశీ 2006లో టీడీపీలో చేరారు. 2009లో విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో లేదా బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే ఆయన సీఎం జగన్ ని, అంతకుముందు బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని స్వయంగా వంశీని దగ్గరుండి మరీ సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. సీఎం జగన్ తో వంశీ మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. వంశీ వైసీపీలో చేరతారని అంతా అనుకుంటున్న సమయంలో.. వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుని అందరికి బిగ్ షాక్ ఇచ్చారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నారన్న వార్తలతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం  చేస్తున్నారు. ప్రస్తుతం యార్లగడ్డ గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. దీంతో గత ఎన్నికల్లో వల్లభనేనితో పోటీ పడి.. ఇప్పుడు కలిసి పనిచేయాల్సి రావడంపై యార్లగడ్డ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.  ఇప్పటికే ఆయన అనుచరులు, కార్యకర్తలు యార్లగడ్డ ఇంటికి చేరుకున్నారు. వల్లభనేని వంశీ చేరికపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.

ఎట్టిపరిస్థితుల్లో వంశీని వైసీపీలోకి చేర్చుకోవద్దని వెంకట్రావ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అక్టోబర్ 28న వెంకట్రావ్ సీఎం జగన్ ని కలవాలని నిర్ణయించుకున్నారు. వంశీ వ్యవహారంలో తాడో పేడో  తేల్చుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అందరిని షాక్ కి గురి చేసింది.