టీడీపీని టార్గెట్‌ చేసిన ఆ ఇద్దరు

ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్‌తో ఈ పొలిటికల్‌ హీట్‌ ఓ రేంజ్‌కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 02:03 AM IST
టీడీపీని టార్గెట్‌ చేసిన ఆ ఇద్దరు

ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్‌తో ఈ పొలిటికల్‌ హీట్‌ ఓ రేంజ్‌కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ

ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్‌తో ఈ పొలిటికల్‌ హీట్‌ ఓ రేంజ్‌కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  ఇప్పుడది పీక్స్‌కు చేరింది. 

ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీకి గుడ్‌బై చెప్పిన వల్లభనేని వంశీ.. ఆ పార్టీపై ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. తన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తున్న టీడీపీ నేతలను ఏకి పారేస్తున్నారు. టీడీపీ  నేతలు తనపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వంశీ. తనని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేష్‌ అంటున్నారని.. మరి లోకేష్‌ ఎందుకు ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకుని ఉన్నారని ప్రశ్నించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు వల్లభనేని వంశీ. తానేమైనా తిరుమలలో వేయి స్తంభాల గుడిని కూల్చానా? విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేశానా? వైజాగ్‌లో  సరస్వతి స్వామిని కలిసేందుకు ఎవరు వస్తున్నారని సీసీ కెమెరాలు పెట్టానా అని ప్రశ్నించారు వంశీ. 

ఇటు మంత్రి కొడాలి నాని కూడా టీడీపీని టార్గెట్‌ చేశారు. సీఎం జగన్‌ చిటికేస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుందన్నారు. చంద్రబాబు పార్టీ మారొచ్చు కానీ… ఇతరులు పార్టీ మారొద్దా అని  మండిపడ్డారు. రెండుసార్లు బీ ఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన కాంగ్రెస్‍‌‌ను ఎందుకు వీడారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలన్నారు. 

చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కొడాలి నాని. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఇసుక దీక్షకు దిగారని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాబు దీక్షకు  హాజరుకాలేదన్నారు కొడాలి. చంద్రబాబు ఇసుక దీక్ష అంతా డ్రామా అంటూ మండిపడ్డారు. మొత్తానికి వంశీ, నాని ఆరోపణలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు అధికార, విపక్ష నేతల మాటల యుద్ధంతో ఏపీలో పొలిటికల్‌ ఫైట్‌ పీక్స్‌కు చేరింది.