ఇద్దరు టీడీపీ ఎంపీలు కనిపించడం లేదు : మే 23తర్వాత ఇంకెంతమంది అజ్ఞాతంలోకి వెళ్తారో

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన వాళ్ల దగ్గర ఈ మధ్య ఓ విషయంలో పొరపాటు చేశానని తెగ

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 11:32 AM IST
ఇద్దరు టీడీపీ ఎంపీలు కనిపించడం లేదు : మే 23తర్వాత ఇంకెంతమంది అజ్ఞాతంలోకి వెళ్తారో

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన వాళ్ల దగ్గర ఈ మధ్య ఓ విషయంలో పొరపాటు చేశానని తెగ

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన వాళ్ల దగ్గర ఈ మధ్య ఓ విషయంలో పొరపాటు చేశానని తెగ బాధపడిపోతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. జ్యుడిషియరీ, సీబీఐ, ఈడీ, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని చంద్రబాబు తెగ బాధపడుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మురళీమోహన్ పైనా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీలో ఉన్నాడా? అనే సందేహం కలుగుతోందన్నారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మురళీ మోహన్ వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. మరో ఎంపీ సుజనా చౌదరి సీబీఐ కళ్లుగప్పి తిరుగుతున్నారని అన్నారు. మే 23 తర్వాత ఇంకెంతమంది టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్తారో చూడాలి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

”చంద్రబాబు నూటికి వెయ్యి శాతం గెలుస్తారట. 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నానని తన భుజాలు తనే చరుచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ. 20 రోజుల్లో తెలుస్తుంది నీ అనుభవం, అంచనాలు ఎందుకు పనికిరాకుండా పోయాయని” అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.