పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు 

  • Edited By: veegamteam , January 10, 2019 / 08:00 AM IST
పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు 

మంచిర్యాల : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుతోంది. పలు గ్రామాలు ఎన్నికలపై ఆసక్తి చూపుతుంతే..కొన్ని గ్రామాలు మాత్రం పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి. మరికొన్ని చోట్ల గ్రామాలు ఏకగీవ్రం దిశగా పయనిస్తున్నాయి. సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు.

మంచిర్యాల జిల్లాలో కాసిపేట మండలం ధర్మారావుపేటలో గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఎస్టీలు లేని చోట ఎస్టీ రిజర్వ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీలు లేని చోట వారికి ఎలా రిజర్వ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఈ ఎన్నికల్లో పాల్గొనబోమని ప్రకటించారు.

కాగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగనున్నాయి. జనవరి 21 వ తేదీన మొదటి విడత, జనవరి 25 వ తేదీన రెండో విడత, జనవరి 30 వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల కోసం పలువురు నామినేషన్ లు వేశారు.