మీ ఓటు సేఫ్‌గా ఉండాలంటే : వెంటనే ఇలా చేయండి

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. ఓటర్ ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫాం 7 ద్వారా లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 01:37 AM IST
మీ ఓటు సేఫ్‌గా ఉండాలంటే : వెంటనే ఇలా చేయండి

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. ఓటర్ ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫాం 7 ద్వారా లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. ఓటర్ ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫాం 7 ద్వారా లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు  వెల్లువెత్తుతున్నాయి. అవి ఎవరు, ఎందుకు దరఖాస్తు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలగిపోవడం కలకలం రేపింది. ఈ వ్యవహారం ఓటర్లలో ఆందోళన  నింపింది. తమ ఓటు హక్కు పదిలంగా ఉందా? లేదా? ఓటు హక్కుని సేఫ్‌గా ఉంచుకోవడం ఎలా? అని వర్రీ అవుతున్నారు. ఈ సమస్యకు ఎన్నికల సంఘం ఓ పరిష్కార మార్గం చూపిస్తోంది.
Also Read: అంతేగా…అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీఫ్

మీ ఓటరు ఐడీని మీ మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడం ద్వారా.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్‌  నంబర్‌ను ఒకసారి లింక్‌ చేస్తే మీ పేరిట ఫామ్‌-7తో సహా ఏమైనా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మీ మొబైల్‌కు హెచ్చరిక (అలర్ట్‌) సందేశం వస్తుంది.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ లింక్‌ ని క్లిక్ చేయడమే. అక్కడ మీ ఎలక్టొరల్‌ ఫోటో ఐడీ కార్డు నంబర్‌ (ఎపిక్‌  నంబర్‌)ను, ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే ఆ నంబర్‌కు వన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలు ఎపిక్‌ నంబర్‌తో మీ ఫోను అనుసంధానం అయినట్లే. మీ కుటుంబసభ్యుల  ఓట్లన్నీ ఒకే నంబర్‌కు ఇలా లింక్‌ చేసుకోవచ్చు. ఇది కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం లేకపోలేదు.
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

ఏపీలో 2 వారాల వ్యవధిలో 8 లక్షల ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు అందాయని ఏపీ ఎలక్షన్ కమిషన్ చీఫ్ గోపాల్ ద్వివేది చెప్పారు. అందులో 2లక్షల ఓట్ల తొలగింపు దరఖాస్తులు ఫేక్ అని  గుర్తించామన్నారు. మిగిలిన 6 లక్షల ఓట్లలో ఎన్ని సరైనవి, ఎన్ని నకిలీవి అన్నది తేల్చాల్సి ఉందన్నారు. ఇప్పటివరకైతే అసలు ఓట్ల తొలగింపు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు కోసం  అందిన దరఖాస్తుల్లో చాలావరకు ఆన్‌లైన్ ద్వారా వచ్చినవేన అని ద్వివేది తెలిపారు.

ఓటర్ల డేటా చోరీ, తొలగింపు వివాదంపై టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం చంద్రబాబు, టీడీపీ వర్గాలు తమ పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్ ద్వారా ఓటర్ల డేటాను  దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ డేటా చోరీ జరిగిందని, అందులో ఓటర్ల ఆధార్ కార్డు, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలు  ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సేవామిత్రలో యాప్  లో ఉన్న తమ మద్దతుదారుల వివరాలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో దొంగిలించి వైసీపీ లబ్ది పొందాలని చూస్తోందని టీడీపీ ఎదురుదాడికి దిగింది.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు