చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు : నెల్లూరు జిల్లాలో కలకలం

ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి.

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 11:15 AM IST
చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు : నెల్లూరు జిల్లాలో కలకలం

ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి.

నెల్లూరు : ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి. వాటిని ఆర్డీవో స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం బయటికి తెలియకుండా దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులను సిబ్బంది కాల్చేందుకు యత్నం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సీరియస్ అయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో 133, 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలలో వీవీ ప్యాట్ స్లిప్స్ దొరికాయి. ఇవి ర్యాండమైజేషన్ లో భాగంగా తీసిన స్లిప్స్ అయ్యి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Read Also : ఇదేం దారుణం : వీధికుక్కలకు అన్నం పెట్టిందని ఫైనేశారు

సోమవారం (ఏప్రిల్ 15, 2019) స్కూల్ ఆవరణలో వందల సంఖ్యలో వీవీ ప్యాట్ స్లిప్స్ కనిపించాయి. స్కూల్ పక్కనే ఉన్న చెత్త కుప్పలో కూడా స్లిప్స్ దర్శనం ఇచ్చాయి. స్లిప్స్ బయటకు రావడంతో ఆర్డీవో, రెవెన్యూ సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే వాటిని సేకరించడం మొదలు పెట్టారు. వాటన్నింటిని కాల్చే ప్రయత్నం చేశారు. మీడియాలో ప్రసారం చేయొద్దని సిబ్బంది వేడుకున్నారు. నిబంధనల ప్రకారం స్లిప్పులను భద్రపరచాలి. సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు, స్థానికులు, ఉన్నతాధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో, రెవెన్యూ సిబ్బంది పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ అడిగారు.    

పోలింగ్ కు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ లో భాగంగా ఈవీఎం ద్వారా 50 ఓట్లు వేస్తారు. ఓట్లు కరెక్ట్ గా పడుతున్నాయా లేదా, ఒక గుర్తుకి ఓటు వేస్తే మరో గుర్తుకి ఓటు పడిందా, ఎన్ని ఓట్లు ఒక గుర్తుకి వెయ్యడం జరిగింది.. ఇలా అన్ని లెక్కలు రాసుకుంటారు. వీవీ ప్యాట్ స్లిప్స్ ప్రకారం ఈవీఎం పనితీరు పరిశీలిస్తారు. ఆ సమయంలో తీసిన వీవీ ప్యాట్ స్పిప్స్ ను సిబ్బంది భద్రపరచాలి.

అందుకు విరుద్ధంగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఈ స్లిప్స్ మాక్ పోలింగ్ కు సంబంధించినవా, లేక ఓటింగ్ జరిగిన తర్వాత వీవీ ప్యాట్ నుంచి బయటకు తీశారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాఫ్తు జరుగుతోంది. ఈ విషయం ఏపీ సీఈవో ద్వివేది దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాలని అన్నారు.
Read Also : కోటిపై చర్యలు తీసుకోండి : డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు