Gehlot vs Pilot: ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎంతకీ తగ్గని గెహ్లాట్, పైలట్.. మరోసారి మాటల యుద్ధంతో కాంగ్రెస్‭లో కలవరం

మరికొద్ది నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సఖ్యత లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు

Gehlot vs Pilot: ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎంతకీ తగ్గని గెహ్లాట్, పైలట్.. మరోసారి మాటల యుద్ధంతో కాంగ్రెస్‭లో కలవరం

War of Words Intensifies againg between Ashok Gehlot vs Sachin Pilot

Gehlot vs Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేతల మధ్య వివాదం ముగియడం లేదు. వాస్తవానికి ఈ వివాదం ఈనాటిది కాదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే తీవ్ర స్థాయికి చేరింది. తిరుగుబాటు, హైకమాండ్ చర్యలు, తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చి ప్రభుత్వం స్థిరత్వాన్ని సాధించినప్పటికీ, పార్టీలో ఏర్పడ్డ వర్గాలు మాత్రం రెండుగా చీలిపోయే ఉన్నాయి. ఏదో సందర్భంలో ఇరు వర్గాలు తమ మధ్య ఆధిపత్య పోరును కనబరుస్తూనే వస్తున్నారు.

Brij Bhushan: ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ లేను.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

రాహుల్ గాంధీ ”భారత్ జోడో యాత్ర” రాజస్థాన్‌లో సాగినప్పుడు ఇరు నేతల మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపించినా మళ్లీ ఇద్దరి మధ్య ఉప్పూ-నిప్పూ వాతావరణమే కొనసాగుతోంది. అశోక్ గెహ్లాట్ గురువారం చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో తాజాగా ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలాయి. సచిన్ పైలట్ పేరును గెహ్లాట్ నేరుగా ప్రస్తావించకుండా ‘కరోనా వైరస్’ అంటూ వ్యాఖ్యానించడం ప్రస్తుత దుమారానికి కారణమైంది. ”సమావేశాలు మళ్లీ జరుపుతున్నాం. ఇంతకుముందు ఒక కరోనా ఉండేది, చాలా పెద్ద కరోనా మా పార్టీలో ప్రవేశించింది” అంటూ వీడియోలో గెహ్లాట్ వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది.

Bharat Jodo Yatra: రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదట, రెయిన్ కోటట

గెహ్లాట్ ఇందులో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, గతంలో పైలట్‌ను ద్రోహి అని, పసలేనవాడని ఇలా అనేక విమర్శలు చేశారు. దీంతో తాజా వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి చేసినవేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, గెహ్లాట్ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సైతం అంతే ధీటుగా సమాధానమిచ్చారు. సచిన్ సైతం గెహ్లాట్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ”రాజకీయాల్లో సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మీరు గౌరవం ఇస్తేనే, గౌరవం పుచ్చుకోగలుగుతారు. ఎవరైనా సరే మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తిపై నిందలు వేయడం చాలా సులభం. ఒకసారి నోరు జారిన తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకోవడం మాత్రం కష్టం. నేను ఎప్పుడూ వ్యక్తిగత దాడులు చేయలేదు” అని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పైలట్ అన్నారు. గౌరవం లేకుండా మాట్లాడే వ్యక్తుల విషయంలో తాను కామెంట్ చేయలేనని, తనపై ఎందుకు కామెంట్లు చేస్తున్నారో కూడా తనకు తెలియదని అన్నారు.

BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ.. పోలీస్ కేసు ఫైల్ చేసిన సుప్రీం లాయర్

ఇదిలా ఉంటే.. మరికొద్ది నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సఖ్యత లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. పైలట్, గెహ్లాట్ మధ్య సయోధ్య కుదర్చడానికి హైకమాండ్ చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. సరి కదా, రోజు రోజుకూ రెండు గ్రూపుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో ఇది ఎంత మేరకు ప్రభావం చూపనుందో చూడాలి.