Publish Date - 1:04 am, Mon, 4 November 19
By
madhuఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? అమరావతి కేపిటల్ సిటీ కాదా? ఇండియా కొత్త మ్యాప్‌లో కేంద్రప్రభుత్వం ఏపీ రాజధాని పేరును ప్రస్తావించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్ని చూపించినా… అమరావతి మాత్రం మిస్ కావడం జనానికి షాకిచ్చింది. జమ్ముకశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత… కేంద్రం భారతదేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో భాగమైన పీవోకేను లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపింది. అయితే, కేంద్రం విడుదల చేసిన మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవడం షాకిచ్చింది.
ఏపీ మ్యాప్‌లో రాజధాని పేరును గానీ, ప్రాంతాన్ని గానీ గుర్తించలేదు. ఫలితంగా పిన్ కోడ్ కూడా లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు షాక్‌కు గురవతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రాజధాని నగర నిర్మాణానికి ఏకంగా 33 వేల ఎకరాలను సమీకరించారు. రాజధాని ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టారు. ప్రస్తుతం హోం శాఖ గుర్తించకపోవడం ఉన్న ఏకైక కారణం… ఈ రెండూ తాత్కాలిక కట్టడాలే. వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, హైకోర్టు భవనం రెండూ తాత్కాలికమేనన్న విషయాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీని ఫలితంగా రాష్ట్ర రాజధాని ఏదనే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టతా లేదు.
విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. దీని ప్రకారమే ఏపీకి రాజధాని పేరు చేర్చలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఏపీ పాలన వ్యవస్థకు సంబంధించి అన్ని కార్యాలయాలు అమరావతికి తరలిపోయాయి. ఏపీ కేంద్రంగానే పాలన వ్యవస్థ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి సంబంధించి రాజధాని పేరు లేకపోవడం రాష్ట్ర ప్రజల్ని నిరాశకు గురి చేస్తోంది.
Read More : ఆపరేషన్ క్లీనింగ్ : టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం
Delhi : నిర్మానుష్యంగా ఢిల్లీ…మూతపడిన షాపులు, ఇళ్లలోనే ప్రజలు
Peddireddy Criticism Chandrababu : చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారు : మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జగన్ కీలక నిర్ణయం
పార్టీ పెట్టిన 9నెలల్లోనే అధికారంలోకి.. టీడీపీకి 40ఏళ్లు!
కారు ధర రూ. 2 లక్షలు.. నెలకు ఖర్చు రూ.3 లక్షలు