Nagarjuna Sagar bypoll : నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది ?

నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది... తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్‌ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్‌లో జెండా పాతాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో... మూడు పార్టీల నేతలు ప్రచారంపై దృష్టిసారించారు.

Nagarjuna Sagar bypoll  : నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది ?

Who Is The Winner In Sagar Bypoll

who is the winner in Nagarjuna Sagar bypoll : నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది… తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్‌ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్‌లో జెండా పాతాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో… మూడు పార్టీల నేతలు ప్రచారంపై దృష్టిసారించారు.

సాగర్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌.. సిట్టింగ్‌ స్థానాన్ని నిలిబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. చివరి రోజున నామినేషన్‌ దాఖలు చేసిన నోముల భగత్‌ తరఫున ప్రచారం నిర్వహించేందుకు పార్టీ ముఖ్యనేతలంతా సాగర్‌కు క్యూ కట్టారు.

అటు తండ్రి సెంటిమెంట్‌నే నమ్ముకున్న భగత్‌… బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా తన వెంటే ఉంటుందని భావిస్తున్నారు. అయితే రాజకీయ అనుభవం లేకపోవడం, స్థానికుడు కాదనే వాదన ప్రతికూలతలుగా మారుతున్నాయి.

ఊహించని విధంగా బీజేపీ బీఫాం పొందిన రవికుమార్‌ నాయక్‌.. సాగర్‌లో కాషాయం జెండా ఎగరవేయాలని తహతహలాడుతున్నారు. దుబ్బాక జోష్‌ ఇక్కడా కంటిన్యూ అవుతోందని నమ్ముతున్నారు. బీజేపీకి సాగర్‌లో సంస్థాగత బలం లేకపోవడం… రాజకీయాల్లో రవికుమార్‌ కొత్త కావడం కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే సీటు ఆశించి భంగపడ్డ సీనియర్లు.. ఆల్రెడీ నామినేషన్ వేసిన నివేదిత ఏమేరకు సహకరిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు… బీజేపీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

కంచు కోటను తిరిగి దక్కించుకుని.. పార్టీ పునర్‌వైభవానికి బాటలు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఇద్దరూ జూనియర్లే కావటం… సుదీర్ఘ రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కిందిస్థాయి నేతలను ప్రభావితం చేయగలిగే సత్తా సాగర్‌లో గెలిపిస్తుందని జానారెడ్డి భావిస్తున్నారు.

టికెట్ల కేటాయింపుతో కమలం పార్టీలో గుబులు రేగింది. ముఖ్య నేతలు ఇప్పటికే సైలెంట్‌ అవడంతో…ఆ పార్టీకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.తనకివే చివరి ఎన్నికలంటూ ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు సీనియర్‌ నేత జానారెడ్డి. అటు అధికార పార్టీ అండతో బరిలోకి దిగుతున్న భగత్‌ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్రిముఖ పోటీతో సాగర్ బై ఎలక్షన్‌ హాట్ హాట్‌గా మారింది.