Kakani Govardhan Reddy : చంద్రబాబు.. వారికి ద్రోహం చేస్తే పవన్ ఎందుకు స్పందించలేదు?- మంత్రి కాకాణి

Kakani Govardhan Reddy : పవన్ కళ్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటలు మేం పట్టించుకోము.

Kakani Govardhan Reddy : చంద్రబాబు.. వారికి ద్రోహం చేస్తే పవన్ ఎందుకు స్పందించలేదు?- మంత్రి కాకాణి

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy : సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు.. రైతాంగానికి ద్రోహం చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా గతంలో ఓట్లు వేయించిన పవన్ కల్యాణ్ కి గత ప్రభుత్వంలో రైతులు పడ్డ ఇబ్బందులు గుర్తుకు రాలేదా అని అడిగారు. నాడు మొద్దు నిద్రలో ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు నిద్ర లేచి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కాకాణి. రైతులు సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.

రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని ఇప్పటికే సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రేపు(మే 12) కావలిలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి కాకాణి పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. చుక్కల భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు మంత్రి అన్నారు. అయితే, ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన కంపెనీ వ్యక్తులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులకు న్యాయం చెయ్యమని సీఎం జగన్ ఆదేశిస్తే.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని విమర్శలు చేశారు. టీడీపీని, పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ప్రజలు గుర్తించ లేదన్న మంత్రి కాకాణి.. వారి విమర్శలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోదన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నప్పటి నుంచి రైతులకు ప్రభుత్వం అండగా ఉందని, వారికి చేదోడు వాదోడుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Also Read..Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై కావాలనే తప్పుడు ప్రచారం : సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

” మొక్కజొన్న కొనుగోలు చెయ్యమని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. సీజన్ ముగిసే లోపే ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటలు మేం పట్టించుకోము” అని మంత్రి కాకాణి అన్నారు.