Siddaramaiah: మోదీ, షా వచ్చినా నన్ను ఆపలేరు.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఛాలెంజ్

ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సిద్ధరామయ్యా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో బీజేపీ తరపున అమిత్ షా ప్రచారం చేశారు. అయినప్పటికీ సిద్ధు గెలిచారు

Siddaramaiah: మోదీ, షా వచ్చినా నన్ను ఆపలేరు.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఛాలెంజ్

Will win from Kolar even if PM Modi, Amit Shah campaigned against me: Siddaramaiah

Siddaramaiah: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చినా తన గెలుపును ఆపలేరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఛాలెంజ్ విసిరారు. కొలార్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్న ఆయన, ఆ నియోజకవర్గంలో మోదీ-షాలు సైతం ప్రచారం చేసినా తాను గెలిచి తీరుతానని అన్నారు. వాస్తవానికి బగల్‭కోట్ జిల్లాలోని బదామి నియోజకవర్గం నుంచి పోటీ దిగే ఆయన.. ఈసారి ఎందుకో కోలార్ నియోజకవర్గానికి మార్చుకున్నారు.

Bharat Jodo Yatra: జమ్మూలో వరుస బాంబు పేలుళ్లు.. అయిననూ భారత్ జోడో యాత్ర సాగుతుందన్న కాంగ్రెస్

‘‘బీఎల్ సంతోష్ (బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి) రానివ్వండి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానివ్వండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానివ్వండి.. వీరంతా వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా కోలార్‭లో నా గెలుపును ఆపలేరు. కచ్చితంగా నేను గెలిచి తీరుతాను’’ అని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్యా అన్నారు.

Assam CM on Pathaan: షారూఖ్ ఖాన్ ఎవరో కూడా తెలియదట.. పఠాన్ సినిమా వివాదంపై అస్సాం సీఎం కామెంట్స్

వాస్తవానికి నియోజక వర్గ మార్పు గురించి ఆయన మొదటగా చెప్పారు. ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సిద్ధరామయ్యా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో బీజేపీ తరపున అమిత్ షా ప్రచారం చేశారు. అయినప్పటికీ సిద్ధు గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. చాముండేశ్వరి నుంచి కూడా పోటీ చేయగా, అక్కడ ఓడిపోయారు.