లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన

  • Published By: madhu ,Published On : March 9, 2019 / 11:08 AM IST
లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన

ఐటీ గ్రిడ్ డేటా చోరీ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ వేడి ఇంకా చల్లారలేదు. జగన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మహాకుట్ర పన్నారని బాబు పేర్కొనడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాము లేవనెత్తిన ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేదని..ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ అర్థం కాలేదని బుగ్గన ఎద్దేవా చేశారు. మార్చి 09వ తేదీ సాయంత్రం బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబుపై పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
Read Also : జనసేన రైతు బంధు : ఎకరానికి రూ. 8వేలు

ప్రజా సాధికారిత సర్వే ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించారు…ఏపీ డేటాను ఎవరో చోరీ చేశారని చంద్రబాబు ఎలా ఆరోపిస్తారని సూటిగా ప్రశ్నించారు. ఫిబ్రవరి 19వ తేదీన ధశరాథమ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు బాబు విడుదల చేసిన నోట్‌లో ఉందని.. దొంగ ఓట్లపై సీఈసీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తప్పేంటీ..ప్రజల వ్యక్తిగత సమాచారం బయటకు వస్తే ప్రశ్నించడం తప్పా ? అని బుగ్గన ప్రశ్నించారు. 

సర్వే చేసిన వివరాలు ఐటీ గ్రిడ్స్‌కు ఎలా వెళ్లాయి ? 
తప్పు చేయకపోతే ఐటీ గ్రిడ్స్ సీఈవో ఎందుకు దాక్కున్నారు ? 
3 కోట్ల 60 లక్షల మంది ప్రజల వివరాలు ప్రైవేటు కంపెనీలకు ఎలా వెళ్లాయి ? 
ఆధార్ డేటా సేవామిత్రలో ఎలా వచ్చింది ? 
ఓటర్ లిస్టులో కలర్ ఫొటోలు ఎలా వచ్చాయి. ?
సాధికారిత మిత్ర, సేవామిత్ర ఒకటి కాదా ? 
ఐటీ గ్రిడ్‌కు డేటా ఎలా వచ్చింది. ? 
వేమూరి హరికృష్ణ ఈవీఎం హ్యకింగ్ విషయంలో అరెస్టు అయ్యారా ? కాదా ? 
అధికారికంగా సలహాదారుడిగా వేమూరి హరికృష్ణని ఎలా పెట్టుకున్నారు ?

వీటికి సమాధానం చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. మరి టీడీపీ సమాధానం చెబుతుందా ? లేదా ? అనేది చూడాలి. 
Read Also : పిల్లులను పట్టుకుంటే.. లక్ష రూపాయలిస్తాం