బినామీల ఆస్తులు కాపాడేందుకే చంద్రబాబు జోలె పట్టారు : ఆర్కే

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 07:25 AM IST
బినామీల ఆస్తులు కాపాడేందుకే చంద్రబాబు జోలె పట్టారు : ఆర్కే

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబుగానీ ఆయన కుమారుడు లోకేష్ గానీ రైతుల కోసం ఒక్క రూపాయన్నా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన సోమవారం (జనవరి 13, 2020) మీడియాతో మాట్లాడుతూ బినామీల ఆస్తులు కాపాడేందుకే చంద్రబాబు జోలె పట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల దగ్గర ఎందుకు దోచుకోవడమని నిలదీశారు. పోలీసులను ఇష్టం వచ్చినట్లు అంటారా అని అన్నారు. మూడు రాజధానులపై ఇంకా ప్రకటన రాలేదన్నారు. చంద్రబాబు ముందే ఊహించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. 

సెక్షన్ 30, సెక్షన్ 144 సెక్షన్ ఉండగా శిబిరాలు పెట్టకూడదన్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాలను తక్షణం ఎత్తివేయాలని డీజీపీని కోరారు. తాము చట్టాలను ఉల్లంఘించామని తనను, రైతన్నలను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. చట్టాలను గౌరవించామని, పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెట్టించుకున్నామని తెలిపారు. తాము చట్టాన్ని ఉల్లంఘించామని కాబట్టి తమపై పోలీసులు కేసు పెట్టారని పేర్కొన్నారు. అవే చట్టాలు టీడీపీకి వర్తించవా అని అడిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను తొలగించాలని అన్నారు. 

దీక్ష శిబిరాల ముసుగులో రైతన్నలు 10 నుంచి 20 శాతం మందే ఉన్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన వ్యక్తులు, పక్కా జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలతోపాటు అంసాంఘీక శక్తులను ప్రవేశపెట్టి ప్రజా ప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. అన్యాయం చేసిన చంద్రబాబు రైతులను మళ్లీ దీక్షా శిబిరాల్లో కూర్చొబెడితే..వారిని రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పరామర్శించేందుకు పంపిస్తున్నారని విమర్శించారు.

సమాజం మీద విపరీత ధోరణలు ఉండే విధంగా టీడీపీ నేతల ప్రసంగాలు ఉంటున్నాయని తెలిపారు. తాము చట్టాన్ని ఉల్లంఘించానని అరెస్టు చేసి కేసు పెట్టారని…కానీ 25 రోజులుగా అనేక రకాలుగా ఆందోళనలు చేస్తున్నారని.. జరుగనివి…జరిగినట్లుగా దేశంలో మిలిగిన చోట్ల జరిగిన సంఘనలను పోలీసులే చేయించినట్లుగా చిత్రీకరిస్తే పోలీసులు ఎందుకు సైలెంట్ ఉన్నారని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారని… అమరావతిలో శిబిరాలు ఎలా పెడతారని ప్రశ్నించారు.