జగన్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : వైసీపీ సభ్యులు డిమాండ్

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో దుమారం రేగింది. చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 07:07 AM IST
జగన్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : వైసీపీ సభ్యులు డిమాండ్

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో దుమారం రేగింది. చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో దుమారం రేగింది. చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ ఉన్మాది అన్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు.. జగన్ కు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. చంద్రబాబు.. ముఖ్యమంత్రిని ఉన్మాది అనడం సరైనదేనా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదాను నీరు గార్చి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పారని మంత్రి బుగ్గన తెలిపారు. ఎన్ టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవో నెంబర్ 2430 లో ఏం తప్పు ఉందో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు నీతులు చెబుతారు..కానీ పాటించరని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలే మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. 
సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు ఈ రోజు సభలోకి రావడమే దురుసుగా వచ్చారని తెలిపారు. చర్చల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. కుటుంబాల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సభా నాయకుడిపై అమర్యాదగా చంద్రబాబు మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆవేశంతో మాటలు దొర్లినప్పుడు వెనక్కు తీసుకోవడంలో తప్పు లేదని చెప్పారు. నిన్న స్పీకర్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని సూచించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మార్షల్స్ తో ప్రతిపక్ష సభ్యులపై దాడి చేయించారన్నారు.