చంద్రబాబు 70 ఏళ్ల వయసులో బూతులు నేర్చుకుంటున్నారు : అంబటి

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 08:02 AM IST
చంద్రబాబు 70 ఏళ్ల వయసులో బూతులు నేర్చుకుంటున్నారు : అంబటి

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు. ఉచ్చరించరాని పదాలతో తిడుతున్నారని విమర్శించారు. శుక్రవారం (డిసెంబర్ 13, 2019) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హౌస్ ను డిజార్డర్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేత తిట్లు తినే దుస్థితి ఉద్యోగులకు రాకూడదన్నారు. 70 ఏళ్ల వయస్సు కలిగిన చంద్రబాబు 15 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

అనకూడదని పదాలు వాడారని, వాటిని ఉచ్చరిండం కూడా సమంజసం కాదన్నారు. 70 ఏళ్లు దాటిన తర్వాత చంద్రబాబు బూతులు నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే అందరూ సంతోష పడతారని చెప్పారు. స్పీకర్ ఇచ్చిన అపార్చునిటీ వినియోగించుకోలేదన్నారు.

ధైర్యం ఉన్నవారు వంశీ మాట్లాడుతుంటే బయటికి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. విచారణ వ్యక్తం చేయకుండా ఏవేవో కథలు చెప్పడం సమంజసం కాదన్నారు. బూతులు మాట్లాడుతున్న, క్రమశిక్షణారాహిత్యం, సభ గౌరవం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే సభ్యులందరూ డిజార్డర్ లోకి వస్తారని చెప్పారు.