పర్మిషన్ ఇవ్వకపోయినా చంద్రబాబుకి పోటీగా దీక్ష చేస్తా : వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం

  • Edited By: veegamteam , November 14, 2019 / 03:18 AM IST
పర్మిషన్ ఇవ్వకపోయినా చంద్రబాబుకి పోటీగా దీక్ష చేస్తా : వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం (నవంబర్ 14,2019) విజయవాడలో 12 గంటల దీక్షకు దిగారు. 

కాగా, చంద్రబాబు చేపడుతున్న ఇసుక దీక్షకు పోటీగా తాను కూడా దీక్ష చేపడతానని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రకటించారు. బాబు దీక్ష వేదికకు సమీపంలోనే తాను కూడా నిరసన చేపడతానన్నారు. చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

చంద్రబాబు దీక్షా శిబిరం ధర్నా చౌక్ దగ్గర తన దీక్షకు అనుమతించాలని హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను పార్థసారథి కోరారు. నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. కాగా ఆయన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శాంతి భద్రతల దృష్ట్యా దీక్షకు పర్మిషన్ నిరాకరించారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా తాను దీక్ష చేస్తానని ఎమ్మెల్యే పార్థసారథి చెబుతున్నారు. దీంతో వాతావరణం మరింత హీట్ ఎక్కింది.

ఇసుక అక్రమ రవాణాలో తనను అనవసరంగా ఇరికించారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్థసారథి. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారని పార్థసారథి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా అంటూ నిలదీశారు.

మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టాలని తొలుత చంద్రబాబు భావించారు. కానీ ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. ఈ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. దీంతో దీక్ష వేదికను ధర్నా చౌక్‌కు మార్చారు చంద్రబాబు.