వైసీపీ ఎమ్మెల్యే రోజా జీతం రూ.3.82 లక్షలు

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 04:23 AM IST
వైసీపీ ఎమ్మెల్యే రోజా జీతం రూ.3.82 లక్షలు

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను ప్రభుత్వం తెలిపింది. రోజాకి నెలకు రూ.3.82 లక్షలు సాలరీగా అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం(అక్టోబర్ 5,2019)  ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించింది. వెహికల్ కోసం నెలకు రూ.60 వేలు, అధికారిక క్వార్టర్స్ లో నివాసం లేని పక్షంలో ఇంటి కోసం నెలకు రూ.50 వేలు, మొబైల్ ఫోన్ ఛార్జీలకు నెలకు రూ.2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు నెలకు రూ.70 వేలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రోజాకి సీఎం జగన్ న్యాయం చేశారు. ఆమెకు నామినేటెడ్ పదవిని ప్రకటించారు. ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య బాధ్యతలు (ఏపీఐఐసీ) అప్పగించారు. ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ గా అపాయింట్ చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో రోజా అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే మంత్రి పదవి రాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని రోజా అన్నారు. పదవుల కోసం కాదు.. పార్టీ కోసం, జగన్‌ను సీఎం చేయడం కోసం కష్టపడి పనిచేశాము అని గతంలోనే చెప్పారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రోజా గుర్తింపు పొందారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షాన్ని ఓ ఆటాడుకున్నారు. చంద్రబాబుకి, టీడీపీ నేతలకు చుక్కలు చూపించారు. విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపి నిలదీశారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. సీఎం జగన్ కి సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు.