విశాఖకు మహర్దశ : ప్రతి ఇంటి అభివృద్దే జగన్ ధ్యేయం – విజయసాయి

  • Published By: madhu ,Published On : October 31, 2019 / 11:12 AM IST
విశాఖకు మహర్దశ : ప్రతి ఇంటి అభివృద్దే జగన్ ధ్యేయం – విజయసాయి

విశాఖకు మహర్దశ పట్టబోతోంది..అన్ని ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది..ప్రతి ఇంటి అభివృద్దే సీఎం జగన్ ధ్యేయం..ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే..భూ కుంభకోణానికి కేంద్రమన్న ఆయన..సీఎం జగన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ఎంత పెద్దవాడైనా..ఏ రాజకీయ పార్టీలో ఉన్నా..భూ కుంభకోణంలో అతని పాత్ర ఉంటే కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. సిట్ పరిధిని పెంచాలని, మరింతకొంత మంది అధికారులను నియమించాలని సీఎం జగన్‌ను కోరడం జరుగుతుందన్నారు. బాబు ఇచ్చిన నివేదిక..వారి మంత్రులను..శాసనసభ్యులను ప్రొటక్ట్ చేస్తూ..అమాయకులపై తప్పులు నెట్టివేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఉత్తరాంధ్రకు త్వరలో మంచి రోజులు వస్తాయన్నారు.

భూ ఆక్రమణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక..జగన్ ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించలేదని చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణ విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని నిర్మాణ విషయంలో గతంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ కమిటీ వేసినట్లు..కేబినెట్, సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు ఎంపీ విజయసాయి. 
Read More :