Mayawati: యోగి బుల్డోజర్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. కాన్పూర్ దేహాత్ ఘటనపై మాయావతి ఆగ్రహం

ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇది యూపీలో రాజకీయంగా వివాదాస్పదమవుతోంది.

Mayawati: యోగి బుల్డోజర్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. కాన్పూర్ దేహాత్ ఘటనపై మాయావతి ఆగ్రహం

Yogi's lives are being lost with bulldozers.. Mayawati's anger over Kanpur Dehat incident

Mayawati: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ గ్రామంలో అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చుతుండగా గుడిసెలో నిప్పంటుకుని తల్లీకూతుళ్లు మరణించిన ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యోగి బుల్డోజర్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వెనుకబాటుతనం తదితర సమస్యలతో సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్ వంటి విశాల రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే బుల్డోజర్ రాజకీయాలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు.

Pakistan: పాకిస్తాన్‭లో రికార్డ్ స్థాయికి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఒక్క లీటర్ ఎంతో తెలుసా?

ఈ విషయమై బుధవారం తన ట్విట్టర్ ద్వారా మాయావతి స్పందిస్తూ ‘‘పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వెనుకబాటుతనం తదితర సమస్యలతో సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్ వంటి విశాల రాష్ట్రంలో, అత్యంత నిస్సహాయంగా ఉన్న ప్రజలను బుల్డోజర్లతో బీజేపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వ బుల్డోజర్ రాజకీయాల కారణంగా అమాయక పేద ప్రజలు తమ జీవితాల్ని సైతం కోల్పోతున్నారు. ఇది చాలా విచారకరం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. కాన్పూర్ దేహత్ జిల్లాలో ఆక్రమణల తొలగింపు పేరుతో జరిగిన దౌర్జన్యం, కాల్పుల్లో గుడిసెలో నివసిస్తున్న తల్లీకూతుళ్ల మరణం, 24 గంటల తర్వాత వారి మృతదేహాలను వెలికితీయడం, యూపీ ప్రకటించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వమా.. యూపీ ప్రజా సంక్షేమం ఎలా సాధ్యం?’’ అంటూ మాయావతి ట్వీట్ చేశారు.

Rahul Gandhi : గుల్మార్గ్‌లో మంచుపై స్కీయింగ్‌ చేస్తూ..ఎంజాయ్‌ చేస్తున్న రాహుల్‌ గాంధీ

యోగి ప్రభుత్వం ‘బుల్డోజర్ కార్యక్రమం’ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై అధికారులు బుల్డోజర్ ఎక్కించి కూల్చడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాధారణమైంది. వాస్తవానికి బయటికి అక్రమాలపై బుల్డోజర్ అని చెబుతున్నప్పటికీ, రాజకీయ కక్ష సాధింపు కోసమే బుల్డోజర్ ఉపయోగిస్తున్నారనే విమర్శలు అనేకం ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఇల్లు, ఆస్తులు కోల్పోయిన రోడ్డున పడ్డవారు ఎందరో. వారికి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందడం లేదనే విమర్శలు సైతం అనేకం ఉన్నాయి.

Tamil Nadu : అనాథాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళల్ని బంధించి కోతులతో కరిపించి అత్యాచారాలు

ఇక తాజాగా ఇదే బుల్డోజర్ కార్యక్రమంలో దు:ఖకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆక్రమణలు తొలగించే క్రమంలో రెండు నింపు ప్రాణాలు బలయ్యాయి. తమ ఇంటిని అధికారులు కూలుస్తుంటే తల్లీకూతుళ్లు ఇంట్లో నిప్పంటుకుని మరణించారు. రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం జరిగిన దారుణం ఇది. వాస్తవానికి లోపల నిప్పు రేగిన సంగతి అధికారులు గమనించలేదు. బుల్డోజర్ ఇంటిని కూల్చాక మంటలు బయటికి చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అధికారులు ఖంగుతిన్నారు.

Kanpur: భర్త, అత్తమామలకు డ్రగ్స్ ఇచ్చి నగలతో పరారైన పెళ్లికూతురు, ‘నేను నిన్ను ప్రేమించలేదు’ అంటూ మెసేజ్

జిల్లా యంత్రాంగం బుల్డోజర్లతో వచ్చి ప్రభుత్వ భూమిలో ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. అలా ఒక గుడిసెను కూడా కూలుస్తుండగా ప్రమీలా దీక్షిత్ (45), ఆమె కూతురు నేహా దీక్షిత్ (20) ఇంట్లోనే మంటల్లో చిక్కుకున్నారు. అయితే వారిని గుడిసెలో ఉండగానే పోలీసులే తగలబెట్టారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు తామే నిప్పంటించుకుని ఆత్మహత్య చేుసకున్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. అభియోగాలు మోపిన వారిలో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్ ఉన్నారు. వారిపై హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా గాయపరిచడం కింద కూడా అభియోగాలు మోపారు.

Odisha: మహిళా ఇన్‭స్పెక్టర్‭పై చెప్పుతో దాడి.. బీజేపీ సీనియర్ నేతపై కేసు నమోదు

ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇది యూపీలో రాజకీయంగా వివాదాస్పదమవుతోంది.