జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్

జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్

వైసీపీ వస్తే కబ్జాలు చేస్తారన్నారు. మీ ఇల్లు, రోడ్డు, కొండ, గుట్ట అన్నీ దోపిడీ అవుతాయని.. వాటి నుంచి కాపాడాలంటే ఓ పోలీస్ కావాలన్నారు. అందుకే వైజాగ్ పార్లమెంట్ నుంచి జేడీని బరిలోకి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ జేడీ లక్ష్మీనారాయణను చూస్తేనే దడ అంటూ వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. వైసీపీ వస్తే కబ్జాలు చేస్తారన్నారు. మీ ఇల్లు, రోడ్డు, కొండ, గుట్ట అన్నీ దోపిడీ అవుతాయని.. వాటి నుంచి కాపాడాలంటే ఓ పోలీస్ కావాలన్నారు. అందుకే వైజాగ్ పార్లమెంట్ నుంచి జేడీని బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించారు పవన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీలను అరికట్టటానికి.. అడ్డుకోవటానికి జేడీని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
Read Also : నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ : వైసీపీలోకి శివాజీరాజా!

వైజాగ్ కి జేడీ కొత్వాల్ గా అభివర్ణించారు. అన్యాయాన్ని తరిమికొట్టే కొత్వాల్ .. కిరాయి గూండాలను తరిమికొట్టే కొత్వాల్ అంటూ జేడీని పొగడ్తలతో ముంచెత్తారు పవర్ స్టార్. వైజాగ్ కు జేడీ కాపలా అని.. వైపీసీ దోపిడీ, కబ్జాల నుంచి కాపాడటానికి వచ్చిన వ్యక్తి లక్ష్మీనారాయణ అన్నారు పవన్.

స్పెషల్ స్టేటస్ అనగానే జగన్ కు దడ.. కేంద్రం ఎక్కడ కేసుల ఫైల్ చూపిస్తుందో అని భయపడుతున్నాడని చురకలు అంటించారు కల్యాణ్. అందుకే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడని జగన్ పై విమర్శలు చేశారాయన. జేడీని గెలిపిస్తే వైజాగ్ సురక్షితంగా ఉంటుందని.. అందరూ జనసేనకు ఓటేయాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.
Read Also : కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా

×