అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్

శ్రీకాకుళం : తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు

  • Published By: veegamteam ,Published On : March 23, 2019 / 01:27 PM IST
అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్

శ్రీకాకుళం : తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు

శ్రీకాకుళం : తాను అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు. కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని తెలిపారు. కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పలాసలో ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టం తీసుకొస్తామని జగన్ వెల్లడించారు.
Read Also : ఎవరి ఆస్తి ఎంతంటే : కొండా విశ్వేశ్వరెడ్డి రూ. 895 కోట్లు

పాదయాత్రలో పలాస ప్రజల కష్టాలు చూశానని జగన్ అన్నారు. హుదూద్‌, తిత్లీ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రైతు రుణమాఫీ హామీని చంద్రబాబు నెరవేర్చారా?…పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా?అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్‌ తీసుకున్నా ఫలితం లేదని.. 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు.

రోజుకో మోసం, అబద్దంతో చంద్రబాబు ఐదేళ్ల పాలన సాగిందన్నారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని జగన్ అన్నారు. ఈసారి వచ్చేది ప్రజల ప్రభుత్వం అని జగన్ చెప్పారు.
Read Also : తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్క ఆంధ్రా కుటుంబాన్ని చూపించు : పవన్‌కు పోసాని సవాల్