ఒక్క ఛాన్స్ ఇవ్వండి : నాన్న కంటే గొప్ప పాలన అందిస్తా

ఒక్క ఛాన్స్ ఇవ్వండి : నాన్న కంటే గొప్ప పాలన అందిస్తా

చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని

ఒక్క ఛాన్స్ ఇవ్వండి : నాన్న కంటే గొప్ప పాలన అందిస్తా

చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని

చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని జగన్ ముమ్మరం చేశారు.  చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు అని అన్నారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ గా చంద్రబాబు  చెలామణి అవుతున్నారని విమర్శించారు.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే

వివేకానందరెడ్డిని చంపింది చంద్రబాబే అని జగన్ ఆరోపించారు. వివేకా హత్యతో చంద్రబాబుకి సంబంధం లేకుంటే సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా  పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ గురించి ప్రశ్నిస్తే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో అనేకమంది వైసీపీ నేతలు హత్యకు గురయ్యారని అన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే శాంతిభద్రతలు ఉంటాయా? అని జగన్ అడిగారు.

చంద్రబాబు మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని.. వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎన్టీఆర్ ను చంపి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్ను  మించిన దుర్మార్గుడు, నీచుడు, భ్రష్టుడు ఎవరూ లేరని సొంత కూతురిని ఇచ్చిన ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు చేయని మోసం ఉండదని, చెప్పని అబద్దం ఉండదని జగన్  అన్నారు. 20 రోజులుగా చంద్రబాబు దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Read Also :మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

×