జాబు రావాలంటే బాబు పోవాలి : జగన్

దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : March 23, 2019 / 07:46 AM IST
జాబు రావాలంటే బాబు పోవాలి : జగన్

దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.

శ్రీకాకుళం : దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు. ‘తిత్లీ తుపాను సాయం మీకు అందలేదని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని నాకు తెలుసు’ అని అన్నారు. పోర్టు కోసం ప్రజలు పడుతున్న బాధలను చూశానని తెలిపారు. వేల మంది కిడ్నీ బాధితులుంటే 370 మందికే సాయం చేశారని చెప్పారు. త్రాగునీరు సరిగ్గా లేదని తెలిసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పలాసలో వైసీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

చంద్రబాబు నోరు తెరిస్తే అభివృద్ధి చేశానని చెబుతారని.. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా? మహిళా సంఘాలకు సున్నా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. బెల్టు షాపులు రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. గ్రామాల్లో మందు ఏరులై పారుతోందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి మరిచారని విమర్శించారు. ‘ఆనాడు జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ఇవాళ జాబు రావాలంటే బాబు పోవాలంటున్నారు’ అని అన్నారు.

‘పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశాను, విన్నాను.. మీకు అండగా నేనున్నాను’ అని భరోసా ఇచ్చారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకుంటామని చెప్పారు. కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. 200 బెడ్ రూమ్ ల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Read Also : జనసేనకు చిరంజీవి మద్దతు : నాగబాబు సంచలన ప్రకటన