వెంకన్న దివ్య దర్శనానికి.. జగన్ సర్వదర్శనం టోకెన్

తిరుపతి నుంచి తిరుమలకి కాలి నడకన వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్. అలిపిరి నుంచి బయలుదేరిన ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు కూడా నడుస్తున్నారు. తిరుమల వెంకన్నను జగన్ సామాన్య భక్తుడి వలే దర్శించుకోనున్నారు. వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం సుపథం నుంచి వెళ్లి నేరుగా దర్శించుకునే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా సామాన్య భక్తులు వెళ్లే మార్గం నుంచే వెళ్లనున్నారు జగన్. దీని కోసం కొండ ఎక్కే మార్గ మధ్యలో ఉన్న సర్వదర్శనం కౌంటర్ దగ్గర టోకెన్ వేయించుకున్నారు జగన్.
అలిపిరి కాలినడక దారిలో సాధారణ భక్తునిలా నడకదారి భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకన్ స్వయంగా తీసుకున్నారు జగన్. స్వామివారి దర్శనాన్ని అతి సామాన్య భక్తుల వలే చేసుకోబోతున్నట్లు వెల్లడించారు ఆయన. ఆయన వెంట వందల మంది కార్యకర్తలు, నేతలు కూడా సర్వదర్శనం టోకెన్ వేయించుకున్నారు.