కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ : వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ కొత్త మార్గదర్శకాలు

  • Published By: chvmurthy ,Published On : December 18, 2019 / 10:18 AM IST
కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ : వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ కొత్త మార్గదర్శకాలు

ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక స్కీమ్ కి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొన్ని అర్హత నిబంధనలను సవరించి కొత్తగా జీవో రిలీజ్ చేసింది. లబ్దిదారుల ఎంపిక కోసం అనుసరించే నియమ నిబంధనలపై ఈ జీవోని తీసుకొచ్చింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం కుటుంబంలో ఒక్కరే పెన్షన్ కు అర్హులు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేల లోపు తలసరి ఆదాయం కలిగి ఉండాలి. 

వైఎస్ఆర్ పెన్షన్‌ స్కీమ్ కు అర్హతలు:
> గ్రామీణ ప్రాంతాల వారికి నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.12 వేల లోపు తలసరి ఆదాయం కలిగి ఉండాలి.
> నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోపు కలిగి ఉండాలి.
> ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.
> కుటుంబంలో పెన్షనర్‌ లేదా ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. ప్రతి నెల కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.
> కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.
> కుటుంబంలో ఒక్కరే పెన్షన్‌ స్కీమ్ కు అర్హులు. అయితే 80 శాతం పైగా దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు, మానసికంగా తీవ్రంగా బాధ పడుతున్న వారుంటే గనక వారికి కూడా పెన్షన్‌ లభిస్తుంది. ఒక ఇంటిలో అలాంటి పరిస్థితి గనక ఉంటే రెండో వ్యక్తికి కూడా పింఛన్‌ లభిస్తుంది.

కేటగిరీల వారీగా అర్హతలు:
> 60 సంవత్సరాల వయసు పైబడిన నిరు పేదలు…ఎస్సీ కేటగిరికి చెందిన వారి వయసు 50 సంవత్సరాలు ఆపైన వయస్సు ఉన్నవారు.
> 18 సంవత్సరాలు పైగా వయసున్న విడోలు అర్హులు. ఐతే వారి దగ్గర చనిపోయిన భర్త ధృవీకరణ పత్రం విధిగా ఉండాలి.
> దివ్యాంగులకు వయోపరిమితిలేదు‌. అయితే 40 శాతం పైగా దివ్యాంగులుగా ఉండాలి. 
> 50 సంవత్సరాలు పై బడిన చేనేత కార్మికులు చేనేత శాఖ నుంచి ధృవీకరణ పత్రాన్ని విధిగా సమర్పించాలి. 
> 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన గీతకార్మికులు ఎక్సయిజ్‌ శాఖ  ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.

> ఆరు నెలలుగా యాంటీ రాట్రో వైరల్‌ తెరపీ ట్రీట్‌మెంటు తీసుకుంటుంటే వారు పై పథకానికి అర్హులు ప్రతి నెలా ఆసుపత్రిలో డయాలసిస్‌ చేసుకుంటున్న రోగులు ఈ పధకానికి అర్హులు. 
> 18 సంవత్సరాల వయసు పైబడిన ట్రాన్స్‌జెండర్లు వైద్యశాఖ నుంచి సర్టిఫికెట్‌ విధిగా కలిగిఉండాలి. 
> మత్స్యశాఖ నుంచి సర్టిఫికెట్‌ పొందిన 50 సంవత్సరాల పైబడిన  మత్స్యకారులు కూడా ఈ పధకానికి అర్హులే.
> వివాహమై విడిపోయిన సింగిల్‌ వుమెన్‌.. 35 సంవత్సరాల వయసు పై బడినవారు..తరువాత భర్తనుంచి విడిపోయిన మహిళలు, ఏడాది పాటు సెపరేషన్‌గా ఉన్న మహిళలు, 30 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు. 
> 50 సంవత్సరాల పైబడి వయసున్న డప్పు కళాకారులు ..సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి. 
> 40 సంవత్సరాల వయసున్న చర్మకారులు  తలసేమిమా, సికిల్‌ సెల్‌ డిసీజ్, మేమోఫీలియా వ్యాధిగ్రస్థులు  వీల్‌ చేర్‌కే పరిమితమైన పెరాలిసిస్‌  రోగులు, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు, మస్కులర్‌ డైçస్ట్రోఫీ వ్యాధిగ్రస్థులు, క్రానిక్‌ కిడ్నీ పేషంట్లు కూడా వైఎస్సార్ పెన్షన్ పధకానికి అర్హులు.

ఎవరెవరికి ప్రాధాన్యత ఉంటుందంటే:
ఎస్‌సీ కుటుంబాలు, చేనేతలు, గీతకార్మికులు, క్షురకులు, దోభీలు,కార్పెంటర్లు, చర్మకారులు, బీసీలు, పశువుల కాపర్లు, దిన కూలీలు, వ్యవసాయ కార్మికులు, సంచార జాతులు,  కుటుంబలో పెనన్‌ కలిగిన భర్త చనిపోతే భార్యకు తిరిగి పెన్షన్‌ దరఖాస్థుదారుల  స్థితి గతులను గ్రామ వలంటీర్లు పరిశీలించి ధృవీకరణ చేయాలి. పెన్షన్లను డోర్‌ డెలివరీ చేసే బాధ్యత కూడా వారిదే. గ్రామాలలో పని చేసే ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల కమిషనర్లు  ఈ పథకం అమలుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈస్థాయి అధికారులే లబ్ధిదారుల ఎంపికను ఫైనలైజ్‌ చేయాలి.