ప్యాకేజీ స్టార్ అంటూ పవన్‌ కళ్యాణ్ పై వైసీపీ నేతల ఫైర్

  • Published By: madhu ,Published On : September 14, 2019 / 12:56 PM IST
ప్యాకేజీ స్టార్ అంటూ పవన్‌ కళ్యాణ్ పై వైసీపీ నేతల ఫైర్

సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై పవన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం..పలు విమర్శలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. బాబు, బీజేపీతో పవన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అవగాహన లేకుండా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని, 100 రోజుల్లోనే 80 శాతం హామీలు నెరవేర్చినట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల ఎంపిక చేయడం జరిగినట్లు, వైసీపీ వారిని మాత్రమే నియమించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. RTA ద్వారా దరఖాస్తు చేసుకుంటే వివరాలు ఇవ్వడం జరుగుతుందని సూచించారు. 

పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయరని, ఎవరో రాసిన స్క్రిప్ట్‌ని చదివి వెళ్లిపోతారని మంత్రి వనిత కామెంట్ చేశారు. ప్యాకేజీ స్టార్ మళ్లీ తెరపైకి వచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల పక్షాన నిలబడాలని అనుకుంటే..అలానే చేయాలని, ప్రజల మధ్యలో తిరిగితే..వారి సమస్యలు ఏంటో తెలుస్తుందన్నారు. లోటుపాట్లు ఉంటే తెలియచేయాలని..సరిదిద్దుకుంటామన్నారు మంత్రి వనిత. 

పవన్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఖండించారు. జగన్ వంద రోజుల పాలనపై పవన్ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం పారదర్శకతతో సీఎం జగన్ పనిచేయడం జరుగుతోందన్నారు. ఇసుక పాలసీపై పవన్ అవగాహన లేదన్నారు. 

వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై నివేదిక ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీపై, సీఎం జగన్ విధానాలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ మేనిఫెస్టో జనరంజకంగా ఉంది కానీ జగన్ చేస్తున్న పాలన మాత్రం జనవిరుద్దంగా ఉందని పవన్ విమర్శించారు. ఇతర అంశాలపై కూడా మాట్లాడారు.