వంశీది డ్రామా : వైసీపీ కార్యకర్తలపై 4వేల అక్రమ కేసులు పెట్టారు

రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు

  • Published By: veegamteam ,Published On : October 27, 2019 / 01:17 PM IST
వంశీది డ్రామా : వైసీపీ కార్యకర్తలపై 4వేల అక్రమ కేసులు పెట్టారు

రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు

రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు వస్తున్న సమయంలో.. వంశీ తీసుకున్న డెసిషన్ చర్చకు దారితీసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన వంశీ.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. దీనికి కారణాలు కూడా వివరించారు. వైసీపీ ఇంచార్జ్ కుట్ర రాజకీయాలు, అధికారుల పక్షపాత ధోరణి కారణంగా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు వంశీ తెలిపారు.

కాగా, వంశీ నిర్ణయం, ఆరోపణలపై గన్నవరం వైసీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ వంశీ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. నిజంగా రాజీనామా చేస్తే.. స్పీకర్ ఫార్మాట్ లో ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. వంశీ వైసీపీలోకి రావడం గన్నవరం వైసీపీ కార్యకర్తలకు ఇష్టం లేదన్నారు. మైండ్ గేమ్స్ ఆడటంలో వంశీ దిట్ట అన్నారు. వంశీ తప్పుడు పనులు చేశారని, వాటిపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్థానిక వైసీపీ నేతలు తెలిపారు. అధికారులు ఎవరినీ వేధించడం లేదన్నారు. చట్టానికి లోబడే విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ కార్యకర్తలపై 4వేల అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేతలు అన్నారు. 

వంశీ పార్టీ మారతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వెళ్తారని కొందరు.. బీజేపీలోకి వెళ్తారని ఇంకొందరు ..ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను కలవడం, అంతకుముందు బీజేపీ సుజనా చౌదరిని కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వైసీపీలో వంశీ చేరకుండా గన్నవరం స్థానిక నేత యార్లగడ్డ వెంకట్రావు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వంశీ వస్తే వైసీపీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇంతలోనే వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు.