Nandamuri Balakrishna : ప్రజల అవయవాలు దెబ్బతీస్తున్నారు, నడ్డి విరుస్తున్నారు- జగన్ పాలనపై బాలకృష్ణ ఫైర్
Nandamuri Balakrishna : జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులే. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల అవయవాలను దెబ్బ తీస్తున్నారు. చెత్త మీద ట్యాక్స్ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు.

Nandamuri Balakrishna
Balakrishna – Mahanadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. టీడీపీ మహానాడు బాలకృష్ణ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు అంతా బాదుడే బాదుడు అని బాలృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా కష్టమే తప్ప మరొకటి లేదని వాపోయారు. అవినీతి అర్భకుడు, కుంభకోణాల కీచకుడు అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.
”పరిపాలన చేత కాక మూడు రాజధానులు అంటున్నారు అని విమర్శించారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులే. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల అవయవాలను దెబ్బ తీస్తున్నారు. గంజాయి పెంపకంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. చెత్త మీద ట్యాక్స్ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి పునర్ వైభవం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందే” అని బాలకృష్ణ తేల్చి చెప్పారు.
Also Read..NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..
అటు చంద్రబాబు సైతం.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ రౌడీలు.. ఖబడ్దార్.. జాగ్రత్త.. అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండటమే తెలుగుదేశం పార్టీ బలం అన్న చంద్రబాబు.. టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని చెప్పారు. ఇది క్యాస్ట్ వార్ కాదు క్యాష్ వార్ అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి అని, సంపద స్పష్టించడం నేర్పిన పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు.