లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే..

Updated On - 4:16 pm, Wed, 20 January 21

Pooja Hegde: టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ఆఫర్లు దక్కించుకుంటోంది పొడుగు కాళ్ల భామ పూజా హెగ్డే. కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. నార్త్‌లో కన్నా సౌత్‌లోనే స్టార్ అనిపించుకున్నఈ భామ 8 ఏళ్ల తర్వాత తమిళ్‌లో సినిమా చెయ్యబోతోంది. మరి పూజా పాప ఏ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందో తెలుసా?

కెరీర్ స్టార్టింగ్‌లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా అసలు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తన టైమ్ కోసం వెయిట్ చేసింది పూజా హెగ్డే. హిందీలో పెద్దగా హిట్ అవ్వకపోవడంతో సౌత్ మీద బాగా కాన్సన్‌ట్రేట్ చేసింది. దెబ్బకి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‌తో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది.. అటు బాలీవుడ్, టాలీవుడ్, ఇప్పుడు కోలీవుడ్ సినిమాలతో పూజా ఫుల్ బిజీగా ఉంది.

తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా.. మహేష్‌తో ‘మహర్షి’ సినిమా చేసింది. బన్నీతో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ఇదే సక్సెస్‌తో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ సినిమాతో పాటు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

టాలీవుడ్‌లోనే కాదు అటు బాలీవుడ్‌లో కూడా ఫుల్ బిజీగా ఉంది. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్‌తో మూవీస్ (మొహంజాదారో- హౌస్ ఫుల్ 4) చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు.. మరో సారి అక్షయ్ కుమార్‌తో సినిమా దక్కించుకుంది. ఇలా బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతున్న ఈ భామకి.. కోలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. హీరోయిన్‌గా ఫస్ట్ తెరంగేట్రం చేసిన తమిళ్‌లో 8 ఏళ్ల తర్వాత సినిమా చెయ్యబోతోంది పూజా.
వాయిస్
ఇటీవల ‘మాస్టర్’ తో సూపర్ హిట్ కొట్టిన దళపతి విజయ్, తన 65 వ సినిమాకు సంబంధించి హీరోయిన్‌గా పూజాను సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాలో యాడ్ అయితే మార్కెట్ పెరగడం గ్యారంటీ. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతోందీ బుట్టబొమ్మ.