తర్వాత ఏమైంది: బికినీ మోడల్ ఫొటోకు పోప్ ఫ్రాన్సిస్ లైక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pope Francis: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రెజిలియన్ బికినీ మోడల్ ఫొటోకు లైక్ కొట్టిన మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ను వివరణ కోరుతున్నారు. పోప్ అధికారిక అకౌంట్ నుంచి నవంబర్ 13న లైక్ కొట్టినట్లు కనిపించిందని క్యాథలిక్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. ఒక రోజు తర్వాత ఆ లైక్ కనిపించకుండాపోయింది.

అక్టోబరు 5న ఆ ఫోటోను పోస్టు చేయగా అందులో ఆమె స్కూల్ లాకర్ దగ్గర నిల్చొని ఉంది. పైగా ఆ ఫొటోకు మీకు నేను ఒకటి లేదా రెండు విషయాలు నేర్పిస్తాను అని క్యాప్షన్ కూడా పెట్టి డెవిల్ ఈమోజీని జత చేసింది. దాదాపు 2లక్షలకు పైగా లైకులు కొట్టేశారు ఈ ఫొటోకు. పోప్ అకౌంట్ నుంచి లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఆ తర్వాత ఆ బికినీ మోడల్ సంబంధించన గ్యారీబొట్టో మేనేజ్‌మెంట్ కంపెనీ COYCo అదే ఇమేజ్‌ను నవంబర్ 13న రీ పోస్టు చేసింది. COYCoకు పోప్ అధికారిక ఆశీర్వాదాలు అందాయి. మా ఐకానిక్ క్వీన్ @nataagataa నటాగటాకు థ్యాంక్స్. అని రాసుకొచ్చింది. ఫొటో షేరింగ్ ప్లాట్ ఫాంలో ఈ మోడల్ పేరు మీద 715పోస్టులు ఉండగా ఆమెకు 2.4మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇక పోప్ లైక్ కొట్టిన విషయానికొస్తే అది స్టాఫ్ ఎవరుచేశారో తెలియదని.. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అన్నారు. వాటికన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఆ లైక్ ను పక్కకుబెడితే ఇన్ స్టాగ్రామ్ లో వివరణ మాత్రం ఎక్కువైపోయింది’ అని అంటున్నారు.

పోప్ ఫ్రాన్సిస్ కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది. 7.4మిలియన్ ఫాలోవర్లు ఉండగా ఆయన అకౌంట్లో 971పోస్టులు మాత్రమే చేశారు. ఆయన పేరుమీద మరో అకౌంట్ కూడా లేదు.

Related Tags :

Related Posts :