Home » పోర్నోగ్రఫీ హానికరమైనది కాదంట..తేల్చిన పరిశోధకులు
Published
1 year agoon
పోర్నోగ్రఫీ(అశ్లీలత)ప్రజారోగ్య సంక్షోభం కాదని బోస్టన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కొంతమంది వ్యక్తులను పోర్నోగ్రఫీ ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని ప్రస్తుత సాక్ష్యాలు సూచిస్తున్నాయి. కాని ఇది హానికారకమైనది కాదని, ప్రజారోగ్య సంక్షోభంగా పోర్నోగ్రఫీ అర్హత పొందదని పరిశోధకులు అంటున్నారు. పోర్నోగ్రఫీ అనేది ప్రజారోగ్య సంక్షోభం అనే వాదనను వ్యతిరేకిస్తూ మరియు అలాంటి వాదన వాస్తవానికి ప్రజల ఆరోగ్యానికి ఎందుకు హాని కలిగిస్తుందో వివరిస్తూ బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు(రీసెర్చర్స్)ఓ ఎడిటోరియల్ రాశారు. ఈ ఎడిటోరియల్ అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పబ్లిష్ అయింది.
పోర్నోగ్రఫీని ప్రజారోగ్య సంక్షోభంగా ప్రకటించే ఉద్యమం… పబ్లిక్ హెల్త్ ప్రమోషన్ యొక్క అనేక ప్రధాన విలువలకు విరుద్ధమైన ఐడియాలజీలో పాతుకుపోయిందని, ఇదొక పొలిటికల్ స్టంట్ అని యూఎప్ లోని బోస్టన్ విశ్వవిద్యాలయం రీసెర్చర్లు నీల్సన్,రోత్ మాన్ తెలిపారు. అమెరికాలోని 17 రాష్ట్రాలు పోర్నోగ్రఫీని ప్రజారోగ్య సంక్షోభంగా ప్రకటించే నిషేధ తీర్మానాలను ప్రవేశపెట్టాయి. 2016 లో ఉటా రాష్ట్రం పోర్నోగ్రఫీని ప్రజారోగ్య సంక్షోభంగా ప్రకటించి తీర్మానాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించిన విషయం తెలిసిందే.
పోర్నోగ్రఫీ వాడకం కాలక్రమేణా క్రమంగా పెరిగింది. అయితే ఇది ‘ప్రత్యక్షంగా లేదా సమీప భవిష్యత్తులో’ మరణం, వ్యాధి, ఆస్తి విధ్వంసం లేదా జనాభా స్థానమార్పుకి దారితీయదు. మరియు ఇది స్థానిక ఆరోగ్య వ్యవస్థలను ముంచేయదు. బదులుగా, అశ్లీల చిత్రాలను చూసే కొంతమందికి ప్రతికూల ఆరోగ్య పరిణామాలు ఉండవచ్చు. కొంతమందికి సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయని ప్రస్తుత సాక్ష్యాలు సూచిస్తున్నాయి (ఉదాహరణకు,హస్త ప్రయోగం వంటి సురక్షితమైన లైంగిక ప్రవర్తన).
అశ్లీల చిత్రాల వాడకం అంతం చేయడానికి ప్రయత్నించే బదులు తక్కువగా పోర్నోగ్రఫీ వాడకం, తరుచుగా కాకుండా అప్పుడప్పుడు వాడే విధంగా ప్రజలను మోటివేట్(ప్రేరేపించడం) అనేవి సహేతుకమైన హాని తగ్గించే లక్ష్యాలు. పోర్నోగ్రఫీ అక్షరాస్యత పెరగడం కూడా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. పోర్నోగ్రఫీ వాడకంతో సహా లైంగిక ప్రవర్తన యొక్క ఏ విధమైన రోగనిర్ధారణ, లైంగిక స్వేచ్ఛను పరిమితం చేయడానికి మరియు కళంకం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఇది ప్రజారోగ్యానికి విరుద్ధం అని వారు తెలిపారు