లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

రూ.పది వేలకే Pocket AC.. నిమిషాల వ్యవధిలో కూలింగ్

Published

on

మనం బయటకు వెళ్లినపుడు సూర్యుడి ఎండతో పోరాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం అనుకుంటాం ఏసీ ఉంటే బాగుంటుందని. శరీరం చల్లబడితే బాగుండు అనుకుంటాం. అందుకే సోనీ కంపెనీ అలాంటి ప్రొడక్ట్ నే సిద్ధం చేసింది. దానినే రియోన్ పోకెట్ అంటారు. పోకెట్ సైజ్డ్ ఎయిర్ కండీషనర్ శరీరాన్ని క్షణాల్లో కూల్ చేస్తుంది. దీనిని టీ షర్టులపైనా.. మెడ వెనుక పౌచ్ లా ఏర్పాటు చేసి కూల్ ఎయిర్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.సుమారు 85గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండదు. అంటే ఓ స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ బరువే. దీనిని బట్టి మనం ఒక వస్తువును మోస్తున్నామనే ఆలోచన కూడా ఉండదు. ఈ డివైజ్ లోపల.. పెల్టియర్ కూలింగ్ ఎలిమెంట్ ను యాడ్ చేస్తారు. అదే కార్లలో, వైన్ కూలర్స్ లో ఏర్పాటు చేసేది. ఈ కూలింగ్ టెక్ ఎఫీషియంట్ గా ఉండటమే కాక ఇంట్లో ఉండే ఏసీల కంటే తక్కువ ఎనర్జీని వాడుకుంటుంది.

ఏసీని ధరించిన వారి శరీరాలు 13డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ కు వచ్చేలా చేస్తుంది. ఈ డివైజ్ పోర్టబుల్ హీటర్ గా కూడా ఉపయోగపడి.. 8డిగ్రీల సెల్సియస్ వరకూ టెంపరేచర్ ను పెంచుకోవచ్చు. డివైజ్ కేవలం ఓ స్మార్ట్ ఫోన్ యాప్ సాయంతో కంట్రోల్ చేయొచ్చు. అది కూడా బ్లూటూత్ తో అటాచ్ అయి ఉంటుంది. ఇలా నిర్థిష్టమైన టెంపరేచర్ ఫిక్స్ చేసుకుని, క్లైమెట్ ను బట్టి స్విచ్ఛింగ్ చేసుకోవచ్చు. డివైజ్ బ్యాటరీ స్టేటస్ కూడా ఇందులో కనిపిస్తుంది.యూఎస్బీ సీ పోర్టు సహాయంతో దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. 2గంటల పాటు ఛార్జింగ్ ఎక్కిస్తే 90నిమిషాల వరకూ పనిచేస్తుంది. వేడి వాతావరణం కనిపించే దారులలో దీనిని ధరించడమనేది పర్ఫెక్ట్. దీనిని పోయిన జులైలోనే సిద్ధం చేసినా.. 2020 టోక్యో ఒలింపిక్స్ కంటే ముందే లాంచ్ చేయాలని అనుకున్నారు. కొవిడ్-19 ఈ సేల్ ను కూడా రీ షెడ్యూల్ అయ్యేలా చేసింది.

ఈ రియోన్ పోకెట్ ధర రూ.14వేల 80 జపనీస్ యెన్లు. అంటే ఇండియా కరెన్సీలో అది రూ.10వేలు. ప్రస్తుతం ఈ డివైజ్ జపాన్ లో మాత్రమే దొరుకుతుంది. వాతావరణ మార్పులు సమ్మర్ లో వేడెక్కేలా చేస్తాయి. అందుకే అదే సమయం ఎంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ డివైజ్ ను అమ్మాలని ప్లాన్ చేస్తున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *