వందమంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు, హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌ గెలవాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

posani krishna murali cm kcr: సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంలో హైదరాబాద్‌లో మత కలహాలు, గొడవలు తగ్గాయన్నారు. ఎన్టీఆర్ తర్వాత హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వందేళ్ల క్రితం హైదరాబాద్‌కు వరద వస్తే నిజాం రాజు ఒక్కరిని కూడా కాపాడే ప్రయత్నం చేయలేదని.. కానీ కేసీఆర్ చేశారని చెప్పారు.

మొన్న వచ్చిన వరదకు ఒక్క కేసీఆర్ కాదు.. వందమంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం


జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ది కొనసాగుతుందని పోసాని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత హైదరాబాద్ లో శాంతిభద్రతలను కాపాడింది కేసీఆరే అని పోసాని అన్నారు. తాను 35ఏళ్లుగా హైదరాబాద్ ను చూస్తున్నట్టు చెప్పారు.
ఒకప్పుడు తెలంగాణలో నీళ్లు లేవు, రైతులు ఇబ్బంది పడేవారని పోసాని వాపోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆకుపచ్చగా మారిందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ దేశంలోనే లేదన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియదన్న పోసాని.. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో పవర్ కట్ లేదని చెప్పారు.

శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం:
టీఆర్ఎస్‌ను గెలిపించాలన్న పోసాని టీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. దిశ ఎన్‌కౌంటర్ పట్ల ప్రభుత్వం ఎలా స్పందించిందో ప్రతీ ఒక్కరూ చూశారని గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలో పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్‌లు జరిగేవని… ఇప్పుడవి 90శాతం తగ్గిపోయాయని అన్నారు. ఇటీవలే గచ్చిబౌలిలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు పోసాని. శనివారం(నవంబర్ 21,2020) హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో దర్శకుడు ఎన్‌.శంకర్‌తో కలిసి పోసాని మీడియాతో మాట్లాడారు.

Related Tags :

Related Posts :