Posting to former Andhra Pradesh CS Anil Chandra Punetha

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ పునేఠాకు పోస్టింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ మాజీ ఛీఫ్ సెక్రెటరీ అనీల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఏపీలో ఎన్నికలవేళ పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించడంతో ఆయనను అప్పటి నుంచి ప్రభుత్వం రిజర్వ్‌లో ఉంచింది. అయితే మే 31వ తేదీ నాటికి పునేఠా పదవికాలం పూర్తి కానున్న క్రమంలో ఆయనను ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎన్నికలకు ముందు అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే

Related Posts