లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పవర్ ఆఫ్ యూత్.. ‘రామ్ జో.. యు రాక్డ్ ఇట్ బ్రో’..

Published

on

Yuvarathnaa

Power Of Youth: ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్ హీరోగా, సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ‘యువరత్న’.. (ది పవర్ ఆఫ్ యూత్).. రగ్బీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సయేషా సైగల్ కథానాయికగా నటిస్తోంది.


బుధవారం తెలుగు, కన్నడ భాషల్లో ‘పవర్ ఆఫ్ యూత్’ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్ పాడారు. శిరీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పవర్ స్టార్ ఎప్పటిలానే తన స్టైల్లో ఎనర్జిటిక్ స్టెప్స్‌తో సందడి చేశాడు. పాటను రిచ్‌గా తెరకెక్కించారు.


‘తొక్కిపెట్టకు నీలో సరుకు.. ఎక్కు పెట్టు తగు లక్ష్యం కొరకు.. విశ్రమించకు.. నీరసించకు.. విజయమందువరకు.. ఊపిరాగినా బతికే కిటుకు.. నేర్పి చూడు నీ ఆలోచనకు.. ఉన్న పేరు మరి కాస్త పేరయే గొప్పదారి వెతుకు.. పవర్ ఆఫ్ యూత్’.. అంటూ రామజోగయ్య శాస్త్రి నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సక్సెస్ ఫంక్షన్లో ‘రామ్ జో.. యు రాక్డ్ ఇట్ బ్రో’ అంటూ సరదాగా చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ యూత్ కామెంట్స్ చేస్తున్నారు. సోనూ గౌడ, ధనంజయ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి.. మ్యూజిక్ : ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ : వెంకటేష్ అంగురాజ్, ఎడిటింగ్ : జ్ఞానేష్, కొరియోగ్రఫీ : జానీ మాస్టర్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, అన్బు-ఆరివు, దిలీప్ సుబ్బరాయన్, విజయ్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *