గెట్ రెడీ ఫ్యాన్స్… పవన్ ట్రిపుల్ ట్రీట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Powerstar Pawan Kalyan Birthday Special Updates: కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ సినిమాగా ‘వకీల్ సాబ్’ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్ 2) పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనుంది.

ఇక ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ నటించే 27వ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా బుధవారం రానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది.

ఇక పవన్ 28వ సినిమా గురించి బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రకటన రాబోతోంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అప్‌డేట్స్‌తో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పవన్ ఫ్యాన్స్‌కు పండగే పండగ అన్నమాట.VakeelSaab

Related Tags :

Related Posts :