లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకం

Published

on

Telangana Intelligence Chief : తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావు నియామకం అయ్యారు. కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా టి.ప్రభాకర్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు (అక్టోబర్ 31, 2020) శనివారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటివరకు ఈ పోస్టులో 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన నవీన్ చంద ఉన్నారు. శనివారం ఇంటెలిజెన్స్ చీఫ్ గా నవీన్ చంద పదవీ విరమణ పొందారు. దీంతో నవీన్‌ చంద్‌ను రిలీవ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31తో ఆయన ఉద్యోగ విరమణ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావుకు బాధ్యతలు అప్పగించింది.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభాకర్ రావు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభాకర్ రావు ఎస్ ఐబీలో ఐజీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌(ఇంటలిజెన్స్‌) టి.ప్రభాకర్‌రావు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఇంటలిజెన్స్‌ బాధ్యతలను చూడనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *