రెండు సినిమాల కుర్రాడు.. ప్రపంచస్థాయి సినిమాతో.. Proud of Nag Aswin

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రెండు సినిమాల దర్శకుడు.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విషయం ఉంది అనిపించుకున్న కుర్రాడు.. ఒక క్లాస్.. ఒక మాస్.. అని తేడా లేదు.. క్లాస్‌గా సినిమా తీసి మాస్ జనాలను మెప్పించేలా సినిమాలను రూపొందించడంలో దిట్ట అన్నట్లుగా మారిపోయాడు.. తెలుగు తెరకు కచ్చితంగా కీర్తి వెలుగులు అద్దుతాడు అని..! అతనే నాగ్ అశ్విన్. మహానటి సినిమా చూశాక అతని ప్రతిభ అర్థమైంది.

ఇప్పుడు అదే సమయం.. అదిరిపోయే కథతో.. పాన్ ఇండియా కాదు.. ప్రపంచస్థాయి సినిమాను రూపొందించేందుకు సిద్ధం అయ్యాడు.. బాహుబలి సినిమాతో తెలుగు కీర్తి పతాకాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన ప్రభాస్ హీరోగా.. దీపికా పదుకునే హీరోయిన్‌గా నాగ్ అశ్విన్ త్వరలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది.

టేస్టున్న నిర్మాతలు ఫీల్డులో ఉంటే తెలుగు సినిమా రేంజ్ ఎంత ఎత్తుకైనా ఎక్కించేసే దర్శకులు మన టాలీవుడ్‌లో ఉన్నారు. ఇప్పుడు కూడా పర్సు కోణంలో కాకుండా ప్యాషన్ కోణంలో చూసే నిర్మాత అశ్వినీదత్.. ఆయనే ఈ సినిమాకు నిర్మాత. ఇక కీర్తి సురేష్ అనే మాములు నటిని మహానటిని చేసి.. ఆ మహానటి సావిత్రిని గుర్తు చేసిన నాగ్ అశ్విన్.. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాను అంటూ ప్రకటించారు. ఈ సినిమా ఖర్చు కూడా తక్కువేం కాదు.. రూ. 500కోట్లు దాటిపోతుందట.

కలల్లో కూడా ఊహించలేని అవాస్తవాలే ద్రుశ్యాలై సినిమాలుగా మారుతుంటే.. కొత్తదనపు కథతో అశ్విన్ సిద్ధం అయ్యాడట. ఒక వ్యక్తి తనను తాను అన్వేషించుకుంటూ హిమాలయాలకో దూద్ కాశీకో వెళ్లడం అనే తాత్వికతను సినిమా చేయడం కొంచెం కష్టమయినా తన మొదటి సబ్జెక్టునే అలా తీసేశాడు. అంతేనా సావిత్రి అనే నటి తండ్రి ప్రేమను అన్వేషిస్తూ ప్రియుడి ప్రేమలో కూరుకుపోయి మనిషితనపు చిక్కుముడులను కరుణతో విప్పుకుంటూ సాగించే విషాదయాత్రను సినిమా మలిచేశాడు.. ఇక్కడా చప్పట్లు కొట్టించేసుకున్నాడు.

ఇప్పుడు అదే కసితో మూడో సినిమాకే.. ఎవరూ చెయ్యలేని సాహసం.. ఎవరూ అందుకోలేని ఎత్తులు.. నమ్మకంగా అడుగేసి.. మెగాఫోన్ పట్టుకుని ప్రపంచం మీదకు ప్రపంచ సినిమా తీస్తానంటూ బయల్దేరాడు.. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్‌తో.. బిగ్గెస్ట్ బడ్జెట్‌తో.. తెలుగు సినిమా గర్వించే.. భారతీయ సినిమా తలెత్తుకునేలా తీసేందుకు సిద్ధం అయ్యాడు. Proud of You Nag Aswin.. అంటూ నెటిజన్లు ప్రశసింస్తున్నారు.

Related Posts