లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ప్రభాస్ 21.. ఒకటి కాదు రెండు అప్‌డేట్స్..

Published

on

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి ఏడాది గడుస్తున్నా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కంటే వెనుక అనౌన్స్ చేసిన ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాల ఫస్ట్‌లుక్‌లు కూడా విడుదలైపోయాయి. కానీ నాగ్ అశ్విన్ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సంక్రాంతికి ఏదైనా అప్‌డేట్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. అయితే వారి ఆశ నిరాశగానే మిగలింది.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఈ సినిమా అప్‌డేట్ గురించి ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించాడు. దానికి స్పందించిన నాగ్ అశ్విన్.. ‘కచ్చితంగా చెప్పాలంటే.. జనవరి 29, ఫిబ్రవరి 26న రెండు అప్‌డేట్స్ వస్తాయి’ అని రిప్లై ఇచ్చారు.