లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Best of 10

ప్రభాస్, మహేష్ బాబుల్లో ఎవరెక్కువ సంపాదిస్తున్నారు? సౌత్ ఇండియన్ రిచ్చెస్ట్ యాక్టర్స్ లో ఇంకెవరంటే?

Published

on

రిచెస్ట్ యాక్టర్లు అనగానే.. అందరికి హాలీవుడ్ నటులు గుర్తుస్తారు.. ఇండియన్ రిచెస్ట్ యాక్టర్లు అంటే.. వెంటనే బాలీవుడ్ అనేస్తారు.. మన దక్షిణ భారత యాక్టర్లలో కూడా రిచెస్ట్ యాక్టర్లు ఉన్నారు. బాలీవుడ్ తో పోటీగా టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ఇలా మరెన్నో సినీ పరిశ్రమల నుంచి ధనవంతులైన నటులు ఉన్నారు.

బాలీవుడ్ తరహాలోనే దక్షిణ భారత సినిమా బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టేలా ఉంటాయి కలెక్షన్లు.. రికార్డులు కొల్లగొట్టడంలోనూ ముందుంటారు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన బాహుబలి.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. బాహుబలి రెండు పార్టులు క్రియేట్ చేసిన మహా ప్రభంజనం అంతాఇంతా కాదు.. రికార్డులు నెలకొల్పింది.2020లో కరోనా తాకిడికి దక్షిణ భారత సినీ పరిశ్రమలకు అంతరాయం ఏర్పడింది. OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే కొన్ని మూవీలు  మినహాయించి పెద్ద స్టార్ హీరోల సినిమాలు చూసే పరిస్థితి లేదు. ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితా 2019 పరంగా పరిశీలిస్తే.. మన దక్షిణ భారతీయ రిచెస్ట్ యాక్టర్లు ఎవరెవరూ ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం..

మన టాలీవుడ్ లో ప్రభాష్ నుంచి మహేష్ బాబు నుంచి మొదలుకుని ఇలా చాలామంది దక్షిణ భారత రిచెస్ట్ స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీ కాంత్ అగ్రస్థానంలో ఉన్నారు. మూడు, నాలుగు స్థానాల్లో ప్రభాష్, మహేష్ బాబు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ఇంకా ఎవరెవరూ? ఎంత సంపాదిస్తున్నారో ఓసారి లుక్కేయండి..

1. రజనీకాంత్ :

Rajiniదక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన తలైవాకు తగిన # 1 స్థానం ఇది . సూపర్ స్టార్ రజనీకాంత్ 2019 లో రూ. 100 కోట్లు సంపాదించాడు. 2.0, పేటా మూవీలతో అతని సంపాదనకు మరింత రెట్టింపు పెరిగింది. అతను ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో 2018లో # 14 నుంచి 2019లో # 13కి ఒక స్థానంలోకి జంప్ చేశాడు.2. మోహన్ లాల్ :

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actorsఫోర్బ్స్‌లో జాబితాలో మోహన్ లాల్ .. రజనీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. # 47లో నిలిచిన మోహన్‌లాల్ 2019లో రూ. 5 64.5 కోట్లు సంపాదించాడు. 60 ఏళ్ల (తన బెల్ట్ కింద 350కి పైగా సినిమాలు చేశాడు. 2019లో ఐదు సినిమాలకు ఒక్కడే పోటీ ఇచ్చాడు. పద్మ భూషణ్ అవార్డును అందుకున్న మోహన్ లాల్.. లూసిఫర్‌ మూవీతో బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్నాడు.

3. అజిత్ కుమార్ :
సిల్వర్ స్ర్కిన్ పై బ్లాక్ బస్టర్ హీరోయిజాన్ని ప్రదర్శిస్తుండు అజిత్ కుమార్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అందుకు బదులుగా విచిత్రమైన జీవనశైలిని కలిగి ఉంటాడు. అతని అభిమాన సంఘాలు అతని డిజిటల్ పరంగా భారీ క్రేజ్ సంపాదించిపెట్టారు.

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actors

విశ్వం (విజయవంతమైన 2019 విడుదల) విజయానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత పింక్ రీమేక్ లో నటించాడు. దక్షిణ భారతంలో రూ. 40.5 కోట్ల సంపాదనతో అజిత్ దక్షిణ భారత సంపన్న నటులలో # 3 వ స్థానంలో ఉన్నాడు.

4. మహేష్ బాబు :

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actorsఫోర్బ్స్ జాబితాలో 20 స్థానాలకు పడిపోయినప్పటికీ 2018లో # 33 నుంచి 2019లో # 53 వరకు మహేష్ బాబు ఇప్పటికీ ఈ జాబితాలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తన సోషల్ మీడియా ఫాలోయింగ్, అతని చిత్రాలపై వచ్చిన లాభాలతో మహేష్ బాబు 2019లో రూ. 35 కోట్లను సంపాదించారు.5. ప్రభాస్ :
దేశంలో అత్యంత పేరొందిన దక్షిణ భారత నటులలో ప్రభాస్ ఒకరు.. బాహుబలి మూవీతో ప్రభాష్ రేంజ్ మారిపోయింది. ఈ రెండు పార్టులతో ప్రభాష్ ప్రపంచ స్థాయి క్రేజ్ సంపాదించు కున్నాడు.Prabhas to Mahesh Babu, these are the richest South Indian actors

వాస్తవానికి, అతను 2019లో శ్రద్ధా కపూర్ సరసన సాహోతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 130 కోట్లతో ఇది భారీ విజయాన్ని సాధించింది. 2019లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ మూవీ కూడా. ఇతర మూవీల్లో 2019లో అతని రూ. 34 కోట్ల ఆదాయంతో నాల్గో స్థానంలో ఉన్నాడు.

6. కమల్ హసన్ :
ఈ జాబితాలో 2019లో ఒక్క మూవీ కూడా విడుదల కాని ఏకైక నటుడు కమల్ హసన్ మాత్రమే. అయినప్పటికీ, 2018తో పోల్చితే, నటుడు ఫోర్బ్స్ జాబితాలో 15 స్థానాలను అధిరోహించాడు.

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actors

ఇప్పుడు జాబితాలో # 56 వద్ద, హసన్ తన రూ. 34 కోట్లను సంపాదించాడు. ఒకవైపు రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు తన సంపాదనతో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తమిళ వెర్షన్‌ను హోస్ట్ చేస్తున్నారు.

7. మమ్ముట్టి :

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actors68 ఏళ్ల ఈ నటుడికి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో దాదాపు 5 దశాబ్దాలని చెప్పవచ్చు. గత సంవత్సరంలో 7 మూవీలు రిలీజ్ అయ్యాయి. ఈ మూవీల నుంచి రూ. 33.5 కోట్లు సంపాదించాడు. తద్వారా ఏడవ స్థానంలో నిలిచాడు.8. ధనుష్ :

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actors2018లో తన # 55 స్థానం నుంచి తొమ్మిది స్థానాలకు పడిపోయాడు హీరో ధనుష్. ఫోర్బ్స్ జాబితాలో # 64 స్థానంలో నిలిచాడు. వాడా చెన్నై, మారి 2లలో రెండు విజయాలతో మంచి బ్రేక్ ఇచ్చాడు. అతని ప్రొడక్షన్ హౌస్ వుండర్‌బార్ స్టూడియోస్ నుండి వచ్చిన మూవీల ద్వారా 2019లో రూ. 31.75 కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి.

9. విజయ్ :
తలపతి… దీపావళి విడుదల బిగిల్ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ ఇంకా నడుస్తోంది. ట్విట్టర్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో హ్యాష్‌ట్యాగ్‌ల గురించి అత్యధికంగా ట్వీట్ చేసిన మొదటి 10 స్థానాల్లో ఒకటిగా నిలిచింది.

Prabhas to Mahesh Babu, these are the richest South Indian actors

ఎంటర్ టైన్మెంట్ విభాగంలో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్ కూడా ఇదే.. అతను రాబోయే సంవత్సరాల్లో తన ఆదాయాన్ని సంపాదించగలడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పైగా రాజకీయాలకు వెళ్ళాలని చూస్తున్నాడు.. 2019లో విజయ్ రూ. 30 కోట్ల సంపాదనతో 9వ స్థానంలో ఉన్నాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *