ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్ రేపే.. మీరు రెడీనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్.. సినిమా అంటే దక్షినాదే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. బాహుబలి సక్సెస్ తర్వాత నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్.. తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి ప్రకటించనున్నారు. ప్రభాస్ 20వ సినిమా గురించి ప్రకటించడానికి ఓ స్పెషాలిటీని క్రియేట్ చేయనున్నారు.

ఈ శుక్రవారం ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి అప్‌డేట్ ప్రకటించారు. 10 జులై 2020న అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నామని రోమన్ న్యూమరికల్స్ తో కూడిన క్లాక్ ఉంచి అప్ డేట్ ఇచ్చారు.

టీ-సిరీస్ హాంకో భూషణ్ కుమార్ అదే పిక్చర్ షేర్ చేస్తూ శుక్రవారం ఉదయం 10గంటలకు మీరంతా ఎదురుచూస్తున్న ప్రభాస్ 20సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ తెలియజేస్తామని అన్నారు. ఇంటర్నెట్ ను హిట్ చేయడానికి ప్రభాస్ తో జతకట్టనున్న హీరోయిన్ ఎవరా అని ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ చివరిసారిగా నటించిన సినిమా సాహో.. శ్రద్ధా కపూర్ తో జతకట్టి పూర్తి చేసిన యాక్షన్ స్టోరీ అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. తమ హీరో హిట్ సినిమాతో ముందుకురావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ విషయానికొస్తే..

అందరూ అనుకుంటున్నట్లుగా ప్రభాస్ 20వ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ కాకపోవచ్చు అని అంటున్నారు. జిల్ మూవీ దర్శకుడు ఎస్ రాధాకృష్ణ డైరక్షన్‌లో ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ డైరక్షన్ ల పూజా హెగ్దే, భాగ్య శ్రీ, ముర్లీ శర్మ, సచిన్ కేడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సత్యాన్ లు మెయిన్ రోల్స్ లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో సాషా చెత్రి పాత్రలో ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ తెలిసిపోయింది. పూజా హెగ్దే సిస్టర్ ఆ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. హిందీ వెర్షన్ ను టీ సిరీస్ సమర్పిస్తుంది. కరోనా వైరస్ కారణంగా సినిమా పనులు వాయిదా వేసిన యూనిట్ వచ్చే నెల ఆగష్టు నుంచి అన్ని నియమాలు పాటిస్తూ సినిమా షూటింగ్ కు రెడీ అయిపోవాలనుకుంటోంది.

Related Posts