లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పచ్చని కాపురంలో వెచ్చని నిప్పులు పోసింది.. ప్రభుదేవా మాజీ భార్య విమర్శలు: టాటూ చెరిపేసిన నయన్..

ప్రభుదేవా మాజీ భార్య నయనతారపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..

Published

on

Prabhu Deva ex-wife Ramlath Sensational Comments on Nayanthara

ప్రభుదేవా మాజీ భార్య నయనతారపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..

నయనతార, ప్రభు దేవాలది ముగిసిపోయిన కథ..కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాత ఇక పెళ్లి పీటలు ఎక్కడమే లేటు అనుకుంటుండగా.. తమ రిలేషన్‌ను కట్టి కబోర్డ్‌లో పడేసి, ఎవరి దారిన వాళ్లు సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభు దేవా మాజీ భార్య రమాలత్ కోపం మాత్రం ఇంకా చల్లారలేదు. పచ్చని తన సంసారంలో వెచ్చని నిప్పులు పోసిందంటూ నయనతారపై విరుచుకుపడుతుందామె. నయనతారతో ప్రేమలో పడిన తర్వాత ప్రభు మాస్టర్ భార్యకు విడాకులు ఇచ్చాడు. అంతకుముందు కొడుకు క్యాన్సర్‌తో చనిపోయాడు.

Prabhu Deva

అటువంటి పరిస్థితిలో తనను వదిలించుకోవడానికి నయనతారే కారణమంటూ రమాలత్ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభు, రమాలత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముస్లిం అయిన రమా, ప్రభు కోసం మతం కూడా మార్చుకుంది. నయనతార కారణంగా తనకు విడాకులిచ్చాడు. అయితే ఎప్పటికైనా తన ఉసురు, తన పిల్లల ఉసురు ఆమెకి తగులుతుందని, పెళ్లైన మగవాళ్ల వంక చూసే ఆడాళ్లని దేవుడు కఠినంగా శిక్షిస్తాడని రమాలత్ ఇటీవల ఇంటర్వూలో చెప్పారు.

Read Also : శివ కళ్లల్లో సంతోషం.. బన్నీకి నెటిజన్ల ప్రశంసలు..

Nayanthara

కాగా నయనతార, ప్రభు దేవాతో ప్రేమాయణం సాగిస్తున్న సమయంలో అతని పేరుని సగం ఇంగ్లీష్, సగం తమిళ్ అక్షరాలతో పచ్చబొట్టు వేయించుకుంది. ప్రభుతో విడిపోయిన తర్వాత కూడా ఆ టాటూ అలానే ఉంది. ఇప్పుడది చెరిగిపోయింది. న‌య‌న్ ఇటీవల షేర్ చేసిన ఫోటో చూస్తుంటే ఆమె టాటూ మార్చేసిందని అర్థమవుతోంది. ప్ర‌భుదేవా పేరుని కాస్తా రీడిజైన్ చేయించి పాజిటివిటీగా మార్చింది. దీన్ని బట్టి నయన్ గత ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో పెళ్లికి రెడీ అనే హింట్ ఇచ్చిందనుకోవచ్చు అని కోలీవుడ్ టాక్. 

Nayanthara

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *